Chiranjeevi Resigns From Politics: మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని, ఇకపై తన జీవితం సినిమాలకే అంకితమని స్పష్టంగా వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, తన రాజకీయ అనుభవం, భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడారు.
ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ, తాను ఇకపై రాజకీయాల్లోకి వేళని విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నా, ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సినీ రంగంపైనే ఉందన్నారు. ప్రజాసేవ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేతులమీదుగా కొనసాగుతుందనీ, రాజకీయాలలో తనకు ఇక ఏ పాత్రా లేదని చెప్పారు.
ఇటీవల చిరంజీవి రాజకీయాలకు దగ్గరయ్యారంటూ వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. కొన్ని రాజకీయ నేతలను కలవడాన్ని రాజకీయ ప్రవేశంగా భావించడం తగదన్నారు. సినీ పరిశ్రమకు అవసరమైన అంశాలపై చర్చించేందుకే తన భేటీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీతోనూ జతకట్టడం లేదని, రాజకీయాల నుండి పూర్తిగా విరమించుకున్నానని మరోసారి స్పష్టం చేశారు.
తన రాజకీయ లక్ష్యాలను, సామాజిక సేవా ధ్యేయాలను పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని చిరంజీవి అన్నారు. జనసేన పార్టీ ప్రజాసేవ కోసం పని చేస్తోందని, తనకు ఉన్న సేవా భావాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. జనసేనలో తన ఎలాంటి చురుకైన పాత్ర ఉండదని తేల్చిచెప్పారు. దీంతో అసలు చిరంజీవి ఎందుకు ఇంత హర్ట్ అయ్యి రాజకీయాలకు రాజీనామా చేశారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొంతమంది వైసిపి అలానే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వల్లే చిరంజీవి ఇలా చేస్తుంటారని కామెంట్స్ పెడుతున్నారు.
అసలు విషయానికి వెళితే .. ఈ మధ్య పుష్ప ఈ వెంట్లు చిరంజీవి కాంగ్రెస్ నేత అని రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. మరోపక్క వైసీపీ నేతలు విపరీతంగా చిరంజీవి పార్టీలు మారే నాయకుడు అని ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు రాజకీయాల్లో ఉంటే చిన్న విషయం కూడా చాలా పెద్దది అవ్వడం ఖాయం. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే చిరంజీవి మీద నెగిటివిటి పెరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి ప్రభావం తన సినిమాల మీద పడకూడదనే రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అవుతున్నానని చిరంజీవి చెప్పినట్టు ఎంతో మంది వాదన.
2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, తొలి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. అయితే, రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ జనసేనను.. స్థాపించి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాబట్టి ఎటువంటి బాధ లేకుండా తన బాధ్యతలు పవన్ కళ్యాణ్ తీసుకుంటారని సింగల్ లైన్లో చెప్పేసి చిరంజీవి తన భారాన్ని కాస్త పక్కన పెట్టేశారు.
చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన పూర్తి సమయాన్ని సినీ పరిశ్రమకే కేటాయించి, మరిన్ని మెమొరబుల్ చిత్రాలు అందించనున్నట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter