Choreographer shrasti verma complaint against rj shekar basha: బిగ్ బాస్ ఫెమ్ ఆర్జే శేఖర్ బాషాపై నార్సింగీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపణలు చేస్తు కేసు పెట్టిన శ్రేష్టివర్మ.. ప్రస్తుతం ఆర్జే శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో శేఖర్ బాషా .. జానీ మాస్టర్ కేసు విచారణ సమయంలో ఉద్దేష పూర్వకంగా తన కాల్ రికార్డులు లీక్ చేశారని ఆరోపణలు చేసింది. అదే విధంగా పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో తన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో.. శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్ తో పాటు అతని వద్ద ఉండే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేయాలని తన ఫిర్యాదులో శ్రేష్టి వర్మ స్పష్టంగా కోరింది. సదరు కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో పోలీసులు శేఖర్ బాషాపై బీఎస్ఎన్ యాక్ట్ సెక్షన్79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మస్తాన్ సాయి, శేఖర్ బాషాలపై ఇప్పటికే లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీరిద్దరు కలిసి లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించారని, వీరు మాట్లాడిన కాల్ రికార్డుల ఆధారాలతో సహా నార్సింగీ పోలీసులకు లావణ్య వీడియోలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. శేఖర్ బాషాపై మరో కేసు నమోదు కావడం వార్తలలో నిలిచింది. మరోవైపు గతంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శేఖర్ బాషాపై కూడ ఒక కేసు నమోదు అయ్యింది.
లక్ష్మీ పడాల్ అనే యువతి.. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శేఖర్ బాషాపై మూడు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా శేఖర్ బాషాను మాత్రం లావణ్య కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ మూడు కేసుల్లో పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter