Chiranjeevi Rajasekhar War: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో చిరంజీవి, రాజశేఖర్ కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఇక ఎప్పటికప్పుడు వీరిద్దరూ తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాజశేఖర్ స్వతహాగా డాక్టర్ కావడంతో.. ఎక్కువ సమయం ఆయన సినిమాలపై ఫోకస్ పెట్టలేకపోయారు. ఇక తీసిన కొన్ని సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడం జరిగింది.
ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎంతో పోరాడిన చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు ఉన్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాలంలో వీరు మాట్లాడిన మాటలు.. నిజంగానే విభేదాలు ఉన్నాయా అనే అంతగా అనిపించాయి. ఇక ఏమైందో తెలియదు కానీ మళ్లీ రాజశేఖర్, చిరంజీవి కలిసిపోయారు అని కూడా రూమర్స్ వచ్చాయి.
ఇకపోతే ఇందులో కూడా ఎంత నిజం ఉందో తెలియదు. ఇదిలా ఉండగా ఒక లైవ్ వీడియోలో చిరంజీవి, రాజశేఖర్ వాదులుడుకోవడం.. మనకు స్పష్టంగా చూపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదో గతంలో ఒక ఈవెంట్ నిర్వహించగా.. ఆ ఈవెంట్లో కృష్ణంరాజు, మోహన్ బాబుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, చిరంజీవి, రాజశేఖర్ కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున మీడియా మిత్రులు కూడా ఉన్నారు.
అలాంటి సమయంలో అనూహ్యంగా అక్కడ జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని రాజశేఖర్ లేచి వెళ్తుండగా.. అప్పుడు మైక్ తీసుకొని చిరంజీవి ఇష్టం లేనప్పుడు ఇలాంటి ఈవెంట్లకు రాకూడదు .ఇష్టం ఉంటేనే రావాలి అంటూ కామెంట్లు చేశారు. దీంతో పోయిన వాడు మళ్ళీ వెనక్కి వచ్చి ఇష్టంతోనే ఈవెంట్ కి వచ్చాను. నాకు ఒకటి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి జరుగుతోంది. ఇలా అబద్ధాల మధ్య నేను ఉండలేను అంటూ రాజశేఖర్ తెలిపారు.
ఇక దీనికి చిరంజీవి మాట్లాడుతూ ..ఏదైనా సరే కరెక్ట్ గా మాట్లాడాలి. ఒకవేళ ఏదైనా సంఘం ఉంటే ఇతడి పై కఠిన చర్యలు తీసుకోవాలి.. అంటూ కామెంట్ చేశారు. ఇక మొత్తానికైతే రాజశేఖర్ చిరంజీవి మధ్య గొడవ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి దేనిని ఉద్దేశించి గొడవపడ్డారు అనే విషయం మాత్రం అర్థం కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
Also Read: Viral Video: వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. రెప్పపాటులో ఘోర ప్రమాదం నుంచి బైటపడ్డ బుడ్డొడు..
Also Read: One Nation One Gold Rate: గోల్డ్ రేట్స్ ను కంట్రోల్ చేసేందుకు మాస్టర్ ప్లాన్..అదేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.