Chiranjeevi Comments on Andhra Pradesh Government: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. రవితేజ ఒక కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. జనవరి 13వ తేదీ సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే జోరుగా ప్రమోషన్ సాగుతుండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మరోసారి ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టికెట్ రేట్ ల వ్యవహారంలో తలెత్తుతున్న ఇబ్బందుల గురించి ఆయనను ప్రశ్నిస్తే దానికి ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏ కారణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు, రెండు కోట్ల తేడా మాత్రమే అంటే ఢీ అంటే ఢీ అన్నట్లుగా గొడవకు వెళ్లకుండా వేరే రకంగా ఎలా దాన్ని రాబట్టుకోవాలో చూడటం మంచిది అంటూ కామెంట్ చేశారు.
అయితే వాల్తేరు వీరయ్య ఈవెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగాస్టార్ ను కొంత ఇబ్బంది పెట్టిందనే వాదన మెగా ఫాన్స్ వినిపిస్తున్నారు. ముందుగా ఆర్కే బీచ్ లో పర్మిషన్ ఇచ్చి తర్వాత ఇక్కడ పర్మిషన్ లేదు, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కి వెళ్ళమని, తర్వాత మరోసారి ఆర్కే బీచ్ కి వెళ్లవచ్చు అని చెప్పి కన్ఫ్యూజన్ కు గురి చేశారు. మరోసారి అక్కడ అనుమతి నిరాకరించడంతో ఏయూలో ఈవెంట్ నిర్వహించారు. అయితే ఇలా ఇంత ఇబ్బంది పెట్టినా విశాఖపట్నం కమిషనర్ నుంచి సీఎంఓ దాకా అందరికీ ధన్యవాదాలు చెప్పి మీరు ప్రసంగం ముగించారు, అంత మంచితనం అవసరమా? అని ఫ్యాన్స్ అంటున్నారు అంటే దానికి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరంగా స్పందించారు.
అవసరమే అని పేర్కొన్న ఆయన ఆ సందర్భంగా నేను ప్రభుత్వం మీద ఫైర్ అయితే నా ఇగో సాటిస్ఫై అవుతుంది కానీ సినిమా, నిర్మాతలు, ఫ్యాన్స్ సహా అందరూ సఫర్ అవ్వాలి. అందుకే ఒక్కోసారి తగ్గడంలో తప్పు లేదంటూ మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ డైలాగ్ పలికి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇక ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి అనేక విశేషాలను కూడా మెగాస్టార్ చిరంజీవి మీడియాతో పంచుకున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాలో సాధారణంగా ఎక్కువ డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయని కానీ ఈ సినిమా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో నిర్మాతలకు కేవలం ఐదు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వేస్ట్ అయిందంటూ మెగాస్టార్ కామెంట్లు చేశారు.
Also Read: Golden Globe To Naatu Naatu : 'నాటు నాటు'కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. హిస్టరీలో ఫస్ట్ టైం
Also Read: Sreemukhi Hot Photos: ఎల్లో కలర్ షార్ట్ డ్రెస్సులో రెచ్చిపోయిన శ్రీముఖి.. అందాలు చూడతరమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook