Marco OTT Streaming: మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మార్కో’. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన కొన్ని మలయాళ చిత్రాల్లో ఇది ఒకటి. తాజాగా ఈ సినిమా అచ్చ తెలుగు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఈ నెల 21వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. ఓవర్సీస్ లో ఈ నెల 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు హనీఫ్ అడేని డైరెక్ట్ చేశారు. క్యూబ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఉన్ని ముకుందన్ తో పాటు సిద్ధిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ రిలీజ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన వన్ ఆఫ్ ది మూవీగా నిలిచింది. ఫస్ట్ టైమ్ హిందీలో థియేట్రికల్ రిలీజైన "మార్కో" అక్కడ కూడా బాక్సాఫీష్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
మార్కో తెలుగులోనూ జనవరి 1న రిలీజై ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా త్వరలో ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉన్ని ముకుందన్ విషయానికొస్తే.. ఇతను తెలుగులో ఎన్టీఆర్, మోహన్ లాల్ హీరోలుగా తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’లో లీడ్ రోల్ ప్లే చేశారు. ఆ తర్వాత అనుష్క శెట్టి కథానాయికగా నటించిన ‘భాగమతి’లో కూడా మంచి రోల్ ప్లే చేశాడు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.