Pattudala -VidaaMuyarchi 1st Week WW Box Office Collection: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుసగా యాక్షన్ సినిమాలతో అదరగొడుతున్నారు. కేవలం రొటిన్ యాక్షన్ సినిమాలతో తమిళ ప్రేక్షకుల ఆరాధ్య నటుడు అయ్యారు. కెరీర్ లో పెద్దగా ప్రయోగాత్మక సినిమాలు చేసిన సందర్భాలు తక్కువే. కేవలం తన వ్యక్తిత్వంతోనే ఈయన స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్నడు. తాజాగా ఈయన తమిళంలో ‘విడాముయార్చి’ మూవీతో పలకరించారు. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటించింది.
ఈ సినిమాను తెలుగులో పట్టుదల పేరుతో విడుదల చేశారు. తమిళం సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ గట్రా చేయకపోయినా.. తమిళంలో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఇప్పటికే 70 శాతం రికవరీ సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక తెలుగులో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. పైగా తండేల్ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. తెలుగులో మూడు కోట్ల టార్గెట్ కు కేవలం రూ. కోటి షేర్ మాత్రమే అందుకొని డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఈ సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ సాధించిన వసూళ్ల విషయానికొస్తే..
తమిళనాడు.. రూ. 72.40 కోట్ల గ్రాస్.. తెలుగు రాష్ట్రాలు..రూ. 2.28 కోట్ల గ్రాస్.. కర్ణాటక.. రూ. 9.30 కోట్ల గ్రాస్.. కేరళ..రూ. 3.20 కోట్ల గ్రాస్.. మిగిలిన భారత దేశంలో రూ. 1.10 కోట్ల గ్రాస్.. ఓవర్సీస్.. రూ. 42.65 కోట్ల గ్రాస్ అందకుంది. మొత్తంగా ఫస్ట్ వీక్ లో రూ. 130.93 కోట్ల గ్రాస్ (రూ. 63.97 కోట్ల షేర్) రాబట్టింది. మొత్తంగా 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 28 కోట్ల షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.