Payal Rajput Upcoming Pan Indian Film: పాయల్ రాజ్‌పుత్ తెలుగు సినీ పరిశ్రమలో పేరు పొందిన అగ్ర హీరోయిన్. ఆమె గురించి తెలుగు వాడికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. "ఆర్ఎక్స్ 100" సినిమా ద్వారా తెలుగు యూత్ గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. ఎవ్వరు ఊహించని రోల్ చేసి తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆమె అందాలు, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. పాయల్ కు ఈ సినిమా, ఎంతో పాపులారిటీ తెచ్చింది. తర్వాత, "మంగళవారం" చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించింది. తెలుగు సినీ పరిశ్రమలో, యువతకు హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. ముఖ్యంగా మంగళవారం సినిమాలో పాయల్ చేసిన రోల్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
కాగా మంగళవారం చిత్రం పాన్ ఇండియా చిత్రంగా వచ్చి మంచి విజయం అందుకుంది.ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం "ప్రొడక్షన్ నం. 1" అనే పేరుతో రూపొందుతుంది. పాయల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. పాయల్ ఈ సినిమాలో చాలా భావోద్వేగ పాత్రలో నటిస్తోంది అని తెలియజేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి పలు ప్రముఖ సినీ వ్యక్తులు హాజరుకాబోతున్నారు.
ఇప్పటివరకు పాయల్, ఫ్యాషన్, గ్లామర్ చిత్రాలతో మాత్రమే ప్రసిద్ధి చెందింది. కానీ ఈ సినిమాతో ఆమెని ఎమోషనల్ పాత్రలో చూడబోతున్న ప్రేక్షకులు. ఆమె నటనకు ఈ చిత్రం కొత్త మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ముని దర్శకత్వంలో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
పెద్ద అంచనాలతో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, తెలుగు సినీ పరిశ్రమలో మరో సరికొత్త ఘట్టాన్ని రాయబోతుంది అని అంటున్నారు ఈ సినిమా సభ్యులు. మంగళవారం తరువాత పాయల్ నుంచి రానున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో..ఈ సినిమా ప్రారంభం నుండి, విడుదల వరకు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. "ప్రొడక్షన్ నం. 1" సినిమా పాయల్ రాజ్‌పుత్ కి మరో మైలురాయి కావడంతో పాటు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందేమో వేచి చూడాలి.
ఇదీ చదవండి : బాలీవుడ్‌లో సంచలనం.. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితోదాడి, ఆసుపత్రికి తరలింపు..
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.