Actress anshu on trinadha rao mazaka teaser comments: మన్మథుడు ఫెమ్ అన్షు తాజాగా.. డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. ఇటీవల మజాకా మూవీ టీజర్ విడుదల నేపథ్యంలో త్రినాథ రావు చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీనిపై ఏకంగా తెలంగాణ మహిళ కమిషన్ సైతం.. సుమోటోగా స్వీకరించి.. డైరెక్టర్ కు నోటీసులు జారీచేసింది. ఈనేపథ్యంలో నటి అన్షు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అన్షు మాట్లాడుతూ.. డైరెక్టర్ ఈ మూవీలో షూటింగ్ నేపథ్యంలో తనను ఇంట్లో వాళ్లలాగా చూసుకున్నారని... ఏరోజుకూడా ఏ విషయంలోను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన చాలా మంచి వారన్నారు. తన సెకంట్ ఇన్నింగ్స్ కోసం ఆయన ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని.. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కూడా నటి అన్షు మాట్లాడారు.
Setting the record straight! @AnshuActress thanks @TrinadharaoNak1 Garu for his love, respect & guidance during #Mazaka. "He's an absolute pleasure to work with and a loveliest man on the planet."
Clearing all rumors, Actress Anshu praises director's kindness & professionalism!… pic.twitter.com/yMljPSWDPG
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 13, 2025
తనకు ఈ ఘటనపై చాలా మెస్సెజ్ లు, ఫోన్ కాల్స్ వచ్చాయని.. అదే విధంగా ఈ మూవీ టిజర్ బాగుందని కూడా చాలా మంది మెస్సెజ్లు చేశారన్నారు. ప్లీజ్ దయచేసి.. ఇక మీదట దీన్ని వదిలేయాలని కూడా చెప్పారు. అంతేకాకుండా.. అభిమానులందరికి కూడా సంక్రాంతి విషేస్ చెప్పారు.
ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ ఘటనపై డైరెక్టర్ త్రినాథ రావు కూడా.. సారీ చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అంతే కాకుండ.. కావాలని అలా అనలేదని.. ఏదో అనుకొకుండా జరిగిపోయిందని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో నటి అన్షు కూడా వీడియో రిలీజ్ చేయడంతో ఈ కాంట్రవర్సీకి ఇంతటితో బ్రేక్ పడినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter