83 Trailer At Burj Khalifa: బుర్జ్​ ఖలీఫాపై '83' ట్రైలర్​- దీపికా పదుకొణె భావోద్వేగం

83 Trailer At Burj Khalifa: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్ సినిమా '83'. విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్​ జోరుగా సాగుతున్నాయి. తాజాగా మూవీ ట్రైలర్​ను బుర్జ్​ ఖలీఫాపై ప్రదర్శించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 10:21 AM IST
  • బుర్జ్​ ఖలీఫాపై 83 ట్రైలర్​ ప్రదర్శన
  • వీక్షించిన చిత్ర యూనిట్​
  • హాజరైన క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్​, సునీల్ గావస్కర్​
  • దీపికా పదుకొణె భావోద్వేగం
83 Trailer At Burj Khalifa: బుర్జ్​ ఖలీఫాపై '83' ట్రైలర్​- దీపికా పదుకొణె భావోద్వేగం

83 Trailer At Burj Khalifa: టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవిత కథ (Kapil Dev life story) ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83'. సినిమా (83 Movie release date) రిలీజ్ డేట్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్​ జోరుగా సాగుతున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్స్​ను చిత్ర యూనిట్​ వినూత్నంగా చేస్తోంది. సినిమా తారాగనంతో పాటు, క్రికెట్​ దిగ్గజాలు కపిల్ దేవ్​, సనీల్​ గావస్కర్​లు  ప్రమోషన్​ కోసం ఇటీవల దుబాయ్ చేరుకున్నారు.

ఇందులో భాగంగా.. ఈ సినిమా ట్రైలర్​ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం.. బుర్జ్​ ఖలీఫాపై (83 Movie trailer at Burj Khalifa) ప్రదర్శించారు.

ఈ సినిమాలో కపిల్​ దేవ్​ పాత్ర పోషించిన రణ్​​వీర్​ సింగ్​, బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణె (Ranveer-Deepika), ఇతర చిత్ర యూనిట్​ సహా కపిల్​ దేవ్​, సునీల్ గావస్కర్​లు ఈ ట్రైలర్​ను బుర్జ్ ఖలీఫాపై వీక్షించి అనందించారు.

ఈ ట్రైలర్​ చూసి దీపికా పదుకొణె భావోద్వేగానికి (Deepika Padukone Gets Emotional
) లోనయ్యారు. వందలాది మంది బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్​ చూసిన ఓ వీడియోను రణ్​​వీర్​ సింగ్ తన ఇన్​స్టా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీజువల్స్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో హల్​ చల్ చేస్తున్నాయి.

83 సినిమా గురించి..

1983 భారత్ ప్రపంచకప్​ను ముద్దాడిన క్షణాలు మన దేశం ఎప్పటికి మరిచిపోలేనివి. ఆ సమయంలో టీమ్ ఇండియా సారథిగా ఉన్న కపిల్ దేవ్​ జీవితం అధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతో వచ్చింది.

ఎట్టకేలకు ఈ నెల 24న సినిమాను విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. ఇందుకోసం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదలవనుంది. త్రీడీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. క్రికెట్ నేపథ్యంతో సాగే సినిమా కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో రణ్​వీర్​ సింగ్, దీపికా పదుకొణె, పంకజ్​ త్రిపాఠి, తమిళ నటుడు జీవా సహా పెద్ద సంఖ్యలో నటినటులు ఉన్నారు.

తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్​పై అక్కినేని నాగార్జున విడుదల చేయనున్నారు.

Also read: RRR Pre Release : ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు అంతా రెడీ.. హోస్ట్‌గా బాలీవుడ్‌ మెగాస్టార్‌?

Also read: Pushpa Day 1 Collection: అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News