Bangalore Man Fund Wife With Boy Friend: అతను ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. నిత్యం నైట్ షిఫ్ట్‌కు డ్యూటీ వెళ్లేవాడు. ఈ క్రమంలో అతని భార్య బాయ్‌ఫ్రెండ్‌కు దగ్గరైంది. భర్తకు అనుమానం రావడంతో ఎలాగైనా కనిపెట్టాలని ప్లాన్ వేశాడు. తన కారు ఎక్కడ తిరుగుతుందో జీపీఎస్ ద్వారా తెలుసుకున్నాడు. ఓ హోటల్లో ఇద్దరిని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కోర్టును ఆశ్రయించి కేసు నమోదు చేయించాడు. బెంగుళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా..
బెంగుళూరుకు చెందిన వ్యక్తి 2014లో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. అతను రాత్రి షిఫ్టులలో పని చేస్తున్నాడు. 2020లో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌తో వచ్చిన కారును కొనుగోలు చేశాడు. ఈ ఫీచర్ ఉన్నట్లు తన భార్యతో సహా ఎవరికీ చెప్పలేదు. అయితే తాను డ్యూటీకి వెళ్లిన తరువాత తన కారును ఎవరో బయటకు తీసుకు వెళుతున్నట్లు గుర్తించాడు.
రాత్రి ఓ హోటల్ ముందు ఆగి.. తెల్లవారుజామున ఐదు గంటలకు తిరిగి వస్తున్నట్లు జీపీఎస్ ద్వారా తెలుసుకున్నాడు. ఓ రోజు ఆ హోటల్‌కు వెళ్లి చూడగా.. షాక్‌కు గురయ్యాడు. భార్య, ఓ వ్యక్తి కలిసి ఓటర్ ఐడీలతో కలిసి రూమ్ బుక్ చేసినట్లు గుర్తించాడు. ఇద్దరినీ నిలదీయగా.. భార్య బాయ్‌ఫ్రెండ్ అతడిని బెదిరించాడు. తన భార్య, ఆమె బాయ్ ఫ్రెండ్‌పై కేసు నమోదు చేసేలా మహాలక్ష్మీపురం పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు వారిపై ఐపీసీ 417, 420, 506, 120బీ సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకలోని మారుమూల జిల్లాలో నివసిస్తున్న మహిళకు కూడా నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
'గత సంవత్సరం ఒక రోజు నేను ఆఫీసులో నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్న సమయంలో నా కారుని ఎవరో బయటకు తీశారని గుర్తించాను. జీపీఎస్ ఆధారంగా నా కారు అర్ధరాత్రి హోటల్ వద్ద ఆగుతున్నట్లు తెలుసుకున్నా. అక్కడికి వెళ్లగా నా భార్య, మరో వ్యక్తితో ఉంది. వారిని నిలదీయగా ఆ వ్యక్తి తీవ్ర పరిమాణాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని బెదిరించాడు. దీంతో కోర్టును ఆశ్రయించా..' అని బాధితుడు తెలిపాడు.
Also Read: Pension Plan: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి.. ప్రతి నెలా పెన్షన్ పొందండి
Also Read: IPL 2023 Updates: టైటిల్ వేటకు లక్నో సూపర్ జెయింట్స్ రెడీ.. ఆశలన్నీ వారిపైనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి