Home Loan Interest Rates: అత్యంత తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న టాప్ 5 బ్యాంకులు

Home Loan Interest Rates: సొంత ఇళ్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకే దేశంలోని అన్ని బ్యాంకులు హోమ్ లోన్స్ పోటీ పడి ఇస్తుంటాయి. ఒక్కో బ్యాంక్ వడ్డీ రేటు ఒక్కోలా ఉంటుంది. మీరు కూడా హోమ లోన్  తీసుకునే ఆలోచన ఉంటే ఈ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 19, 2025, 03:18 PM IST
Home Loan Interest Rates: అత్యంత తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న టాప్ 5 బ్యాంకులు

Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకునే ముందు చాలా అంశాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. వడ్డీ ఎంత, ప్రోసెసింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు వంటి అంశాల్ని పూర్తిగా తెలుసుకున్న తరువాతే హోమ్ లోన్ ప్రోసెస్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మీ కోసం తక్కువ వడ్డీకు హోమ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకుల వివరాలు అందిస్తున్నాం.

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గించిన తరువాత చాలా బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గించేశాయి. హోమ్ లోన్లపై వడ్డీ అనేది బ్యాంకుని బట్టి, వ్యక్తిని బట్టి మారుతుంటుంది. ఎందుకంటే సిబిల్ స్కోర్ బాగుంటే వడ్డీ రేటు తక్కువగా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఆ వ్యక్తి రీ పేమెంట్ హిస్టరీ, ఆర్ధిక పరిస్థితి ఇలా అన్నీ ఉంటాయి. దేశవ్యాప్తంగా చిన్న చిన్న బ్యాంకుల నుంచి పెద్ద బ్యాంకుల వరకు  అన్నీ హోమ్ లోన్స్ క్యాంపెయిన్ నిర్వహిస్తుంటాయి. హోమ్ లోన్స్ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్నచిన్న ఊర్లలో కూడా హోమ్ లోన్స్ ఇస్తున్నాయి బ్యాంకులు. అందుకే మధ్య తరగతి ప్రజలకే కాదు ఎవరికైనా సరే హోమ్ లోన్స్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఈ క్రమంలో తక్కువ వడ్డీకు హోమ్ లోన్స్ ఇస్తున్న 5 బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

1. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ వడ్డీ 8.10 శాతం
2. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్ వడ్డీ 8.10 శాతం
3. బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ వడ్డీ 8.15 శాతం
4. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ లోన్ వడ్డీ 8.15 శాతం
5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ వడ్డీ 8.25 శాతం

అయితే ప్రతి బ్యాంకు అన్న రకాల రుణాలపై ప్రోసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంటుంది. ఇది బ్యాంకుని బట్టి మారుతుంది. కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ ప్రోసెసింగ్ ఫీజు తీసుకుంటే మరి కొన్నిబ్యాంకులు లోన్ మొత్తాన్ని బట్టి వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రోసెసింగ్ ఫీజు వసూలు చేయవు.

Also read: Teacher Transfers: ఏప్రిల్ నుంచి టీచర్ల బదిలీలు, జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News