Chapathi Viral Video: ఒకేసారి 5 చపాతీలు చేసే ట్రిక్ .. ఇలా నిమిషాల్లో ఎన్నైనా చేసేయొచ్చు..!

Chapathi Viral Video: సౌత్ నుంచి నార్త్, ఈస్ట్ నుంచి వెస్ట్‌ ఏ గడప తొక్కినా ప్రతి ఇళ్లలో ఉండే ఆహారం ఏదంటే చపాతీ. ఉత్తర భారతంలో దీని వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, సాధారణంగా ఇళ్లలో ఎక్కువ మంది కుటుంబీకులు ఉన్నా లేదా చుట్టాలు వచ్చినా చపాతీలు అంతమందికి చేయలేక విసుగువస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 23, 2024, 12:45 PM IST
Chapathi Viral Video: ఒకేసారి 5 చపాతీలు చేసే ట్రిక్ .. ఇలా నిమిషాల్లో ఎన్నైనా చేసేయొచ్చు..!

Chapathi Viral Video: సౌత్ నుంచి నార్త్, ఈస్ట్ నుంచి వెస్ట్‌ ఏ గడప తొక్కినా ప్రతి ఇళ్లలో ఉండే ఆహారం ఏదంటే చపాతీ. ఉత్తర భారతంలో దీని వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, సాధారణంగా ఇళ్లలో ఎక్కువ మంది కుటుంబీకులు ఉన్నా లేదా చుట్టాలు వచ్చినా చపాతీలు అంతమందికి చేయలేక విసుగువస్తుంది. చేతులు నొప్పి పుడతాయి కూడా. అయితే, ఒకేసమయంలో 5 చపాతీలు చేసే ట్రిక్ తెలిస్తే ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే వైరల్‌గా మారింది. 

చపాతీలు రుచికరంగా ఉండటమే కాదు రైస్ కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే ఒక చపాతీలో దాదాపు 104 కేలరీలు ఉంటాయి. అందుకే అన్నానికి బదులుగా వీటిని తినడం మంచిది. అంతేకాదు డైట్ పాటించేవారు కూడా వీటికే ప్రాముఖ్యతను ఇస్తారు.

ఇదీ చదవండి: Samantha Fitness Secret: నాలుగు పదుల వయసులో కూడా సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే

అయితే, ఈ చపాతీలు చేయాలంటే పిండిని కలిపే విధానం చాలా ముఖ్యం. ఎక్కువ గట్టిగా ఉండుకూడదు, పిండి ఎక్కువ పలుచగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు అందులో కాస్త నూనె వేయాలి. కొంతమంది పాలు కూడా కలుపుతారు. దీంతో రుచి అద్భుతంగా ఉంటుంది. పిండి కలిపిన కనీసం పదినిమిషాలైన మూతపెట్టి పక్కన పెట్టాలి. గాలి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇదీ చదవండి: Makeup Removal Tips: మేకప్ తొలగించేటప్పుడు ఏ పొరపాట్లు చేయకూడదో తెలుసా

 

ఆ తర్వాత వీడియోలో ఈ మహిళ ఒకేసారి ఐదు చపాతీ ముద్దలను తీసుకుంది. చపాతీ తయారు చేసే పీటపై ముందుగా పొడిపిండిని జల్లుకుంది. ఇప్పుడు ఒకేసారి ఐదు చపాతీలు తీసుకుని వాటికి మధ్యలో పొడిపిండిని వేసి పీటపై పెట్టి మాములు చపాతీలు వత్తుకున్నట్లుగా రోలింగ్ పిన్ తో చకచకా చేసేసింది. ఇలా అయితే, కిచెన్ లో ఎక్కువ సమయం వృథా కాదు. అంతేకాదు అలసిపోకుండా ఉంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీనికి కామెంట్లుగా విభిన్నంగా పెడుతున్నారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News