Rapid Rail In India: దేశంలో రైల్వే రూపురేఖలు మారిపోయనున్నాయి. ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించి ప్రయాణ సమయాన్ని తగ్గించగా.. త్వరలోనే రాపిడ్ రైలును తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘజియాబాద్‌లోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. త్వరలోనే ప్రధాని మోదీ చేతులమీదుగా ర్యాపిడ్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ర్యాపిడ్ రైలును ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మొదటి దశలో ప్రారంభించనున్నారు. అనుసంధానించబడిందని మీకు తెలియజేద్దాం. ఈ కారిడార్‌లో 17 కి.మీ మొదటి దశగా కింద ప్రారంభించనున్నారు. ఈ మార్గం మొత్తం పొడవు 82 కిలోమీటర్లు. ఇందులో 68 కి.మీ ఉత్తరప్రదేశ్‌లో.. 14 కి.మీ ఢిల్లీలో భాగమై ఉంది.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ద్వారా ఎన్‌సీఆర్‌లో ఈ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) నెట్‌వర్క్‌ని సిద్ధం చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్ ఢిల్లీ మెట్రోతో అనుసంధానమై ఉంటుంది. దీంతోపాటు పానిపట్, అల్వార్, మీరట్ వంటి అనేక నగరాలు ఢిల్లీకి లింక్ చేస్తారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతుండగా.. 2025 నాటికి ఢిల్లీ-మీరట్ మధ్య పూర్తిస్థాయిలో ర్యాపిడ్ రైలు నడుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే.. ఈ మార్గంలో ప్రయాణం గంట కంటే తక్కువ పడుతుందని అంటున్నారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ మొదటి విభాగం తెరిచేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ర్యాపిడ్ రైలు గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తుంది. ఈ రైలులో మొత్తం 6 కోచ్‌లు ఉండనున్నాయి. ఈ రైలు లుక్ బుల్లెట్ రైలులా ఉంటుంది. ఒక నగరం నుంచి మరో నగరానికి అధిక వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఈ రైళ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్న మొదటి దశ పనుల కింద సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై స్టేషన్‌ల మధ్య ర్యాపిడ్ రైలుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి.
ఈ ట్రైన్‌లో 2x2 సర్దుబాటు సీట్లు ఉంటాయి. ఫ్రీ వైఫై, మొబైల్ కోసం ఛార్జింగ్ సాకెట్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అనేక ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. రైలులో ఒక కంపార్ట్‌మెంట్‌తో పాటు ఒక్కో కోచ్‌లో కొన్ని సీట్లు మహిళలకు కేటాయిస్తారు. మొదటి దశలో విజయవంతం అయితే.. మిగిలిన ప్రాంతాలకు కూడా ర్యాపిడ్ రైలును విస్తరించనున్నారు.
Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook