Mudra Loan Apply: కేంద్ర ప్రభుత్వం 2024 వార్షిక బడ్జెట్లో పీఎం ముద్ర యోజన స్కీము లిమిట్ ను రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షల వరకు చేర్చిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ సమయంలో ప్రకటన చేయగా..తర్వాత కొద్ది రోజులకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పుడు 4 కేటగిరీల కింద వేర్వేరు మొత్తం లోన్ రానుంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం లోన్లు అందించడమే లక్ష్యంగా చిన్న చిన్న వ్యాపారుల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ లాంచ్ చేయగా..అప్పటి నుంచి ఏటా పెద్ద మొత్తంలో నిధులు అందిస్తోంది. కిందటిసారి ఆ మొత్తాన్ని మరింత పెంచింది.
స్వయం ఉపాధిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీము కింద వ్యవసాయేతర, కార్పొరేట్ బెనిఫిట్స్ కోసం లోన్స్ ఇస్తారు. ముఖ్యంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే నిరుద్యోగులు, యువకులు, మహిళలు తమ వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవాలనుకునే చిన్న చిన్న వ్యాపారవేత్తలు కూడా ఈ స్కీమ్ కింద లోన్లు పొందే వెసులుబాటు ఉంటుంది.
Also Read: Gold vs Stock Market: బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్..గత పదేళ్లలో అత్యధిక రాబడిని ఏది ఇచ్చింది?
అంతకుముందు ఈ స్కీమ్ కింద మూడు రకాల కేటగిరీలు ఉండేవి. ఇప్పుడు దాన్ని నాలుగుకు పెంచింది. శిశులోన్ కింద రూ. 50వేల రుణం పొందవచ్చు. కిషోర్ లోన్ కింద రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు లోన్ వస్తుంది. తరుణ్ లోన్ కింద రూ. 5 నుంచి 10లక్షల వరకు లోన్ వచ్చేది. ఇప్పుడు తరుణ్ ప్లస్ కేటగిరీ తీసుకువచ్చి దీని కింద రూ. 20లక్షల వరకు లోన్ అందిస్తోంది. ఈ లోన్ పొందాలంటే తరుణ్ కేటగిరీ కింద లోన్ తీసుకుని తిరిగి సకాలంలో చెల్లించినవారికి తరుణ్ ప్లస్ వస్తుంది.
Also Read: Petrol Diesel Price: రూ. 50లకే పెట్రోల్, డీజిల్ ధర.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం
ముద్ర స్కీమ్ కింద లోన్లు పొందాలనుకుంటే కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను ఆశ్రయించవచ్చు. ఇక్కడ మీరు ఎందుకోసం లోన్ తీసుకొంటున్నారో చెప్పాల్సి ఉంటుంది. ఇక రెగ్యులర్ లోన్ల కంటే ఇక్కడ కొంచెం తక్కువ వడ్దీ రేటుకే లోన్స్ పొందవచ్చు. అయితే ఎలాంటి హామీ లేకుండా లోన్ తీసుకోవచ్చు. లోన్స్ ఈఎంఐల్లో చెల్లించాల్సి ఉంటుంది. రీపేమెంట్ వ్యవధి 12నెలల నుంచి 5ఏళ్ల వరకు ఉంటుంది. ఎక్కువగా మహిళా వ్యాపారులే ఈ స్కీమ్ కింద లబ్ది పొందుతున్నట్లు గతంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ నుంచే 50శాతానికిపైగా ఉన్నట్లు వివరించారు. ఈ స్కీముతో క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు దేశ ఆర్ధిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 80శాతానికిపైగా శిశు రుణాలే మంజూరు అయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.