PM Narendra Modi: వాణిజ్యరంగానికి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాల్ని ఎంఎస్ఎంఈ పరిధిలో తీసుకొస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
వాణిజ్యరంగంలో కేంద్ర ప్రభుత్వం(Central government) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాల్ని ఎంఎస్ఎంఈ పరిధిలో తీసుకొస్తున్నట్టుగా కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ నిర్ణయం చారిత్రాత్మకమైందని ప్రధాని మోదీ (Pm Modi) తెలిపారు. ఫలితంగా కోట్లాదిమంది వర్తకులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనికి సంబంధించిన నూతన మార్గదర్శకాల్ని విడుదల చేశారు. కొత్త నిబంధనలతో 2.5 కోట్ల రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులకు లబ్ది చేకూరనుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణాలు లభించనున్నాయి. ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌లో నమోదు అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య స్వాగతించింది. ఎంఎస్ఎంఈ(MSME)లకు వర్తించే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు ఇకపై తమకు కూడా వర్తిస్తాయమని సీఏఐటీ తెలిపింది. తాజా నిర్ణయంతో సంబంధిత వ్యాపారులకు రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు లభిస్తాయని వెల్లడించింది. చిన్న సంస్థల్ని పటిష్టం చేసేందుకు, ఆర్ధిక వృద్ధికి చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నితిన్ గడ్కరీ (NItin Gadkari) తెలిపారు. అంతేకాకుండా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద 250 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన హోల్‌సేల్ వ్యాపారులు, చిన్నస్థాయి రిటైలర్లు వెంటనే ఫైనాన్స్ పొందే అవకాశముంది.
Also read: Corona Second Wave: దేశంలో కరోనా సకెండ్ వేవ్ ఇంకా తగ్గలేదు : కేంద్రం హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook