Flipkart Samsung F22: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రస్తుతం మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టింది. Samsung, Apple, Xiaomi, Oppo వంటి అనేక కంపెనీల స్మార్ట్ఫోన్లను భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ సేల్ లో SAMSUNG Galaxy F22 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.49 కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
SAMSUNG Galaxy F22 తగ్గింపులు
శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ 22 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ.16,999గా ఉంది. కానీ, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఫోన్‌పై 2 వేల రూపాయల తగ్గింపు లభిస్తోంది. ఆ ఆఫర్ తర్వాత రూ.14,999 ధరకు ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ కొనుగోలుపై అనేక బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తున్నాయి. దీని వల్ల ఫోన్ కొనుగోలు ధర గణనీయంగా తగ్గుతుంది.
మీరు ఫోన్‌ను కొనుగోలు చేయడానికి IDFC క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంటే ఫోన్ ధర వెయ్యి రూపాయలు తగ్గుతుంది. దీని తర్వాత ఈ ఫోన్ రూ. 13,999 ధరకు అందుబాటులోకి వస్తుంది.
SAMSUNG Galaxy F22 స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా.. అత్యధికంగా రూ. 13,950 డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండిషన్ ను బట్టి దాని ఎక్స్ఛేంజ్ ధరను ఫ్లిప్ కార్ట్ సంస్థ నిర్ణయిస్తుంది. పైన చెప్పిన అన్ని ఆఫర్లు వర్తింపు తర్వాత ఈ ఫోన్ రూ. 49 ధరకే కొనుగోలు చేయోచ్చు.
Samsung Galaxy F22 స్పెసిఫికేషన్స్
1) డిస్ ప్లే - 6.4-అంగుళాల HD+ sAMOLED
2) రిఫ్రెష్ రేట్ - 90Hz
3) కెమెరా - 48 మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా, 8 MP సెకండరీ కెమెరా, 2 -2 MPతో మరో రెండు కెమెరాలు
4) ఫ్రంట్ కెమెరా - 13 మెగా పిక్సెల్స్
5) బ్యాటరీ బ్యాకప్ - 6,000 mAh
6) సెక్యూరిటీ - ఫింగర్ ప్రింట్, సెన్సార్
7) కనెక్టివిటీ - USB టైప్ - C, 4G LTE వంటి సదుపాయాలు ఉన్నాయి.
Also Read: LPG Price Hike: సామాన్యులపై మరో భారం.. రెట్టింపు అవ్వనున్న గ్యాస్ సిలిండర్ ధర.. ఎప్పటినుండంటే..??
Also Read: Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు.. రూ.764 ధరకే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook