Aadhaar Card Validity: ఆధార్ కార్డుకు వ్యాలిడిటీ ఉంటుందా, ఎలా చెక్ చేసుకోవాలి

Aadhaar Card Validity: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధార్ ఆధారమైపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పనులన్నీ ఆధార్ కార్డు లేకుండా జరగని పరిస్థితి. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయించుకోవాలి. ఈ క్రమంలో ఆదార్ కార్డు పనిచేస్తుందా లేదా అనేది చాలా ముఖ్యం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2024, 07:00 AM IST
Aadhaar Card Validity: ఆధార్ కార్డుకు వ్యాలిడిటీ ఉంటుందా, ఎలా చెక్ చేసుకోవాలి

Aadhaar Card Validity: ఆధార్ కార్డు అనేది ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. ఒకవేళ యాక్టివ్‌గా లేకుంటే మీ గుర్తింపును నిర్ధారించేందుకు వీలుండదు. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆధార్ కార్డు వ్యాలిడిటీని చెక్ చేసుకునేందుకు అవకాశముంది. నిత్య జీవితంలో భాగమైన ఆధార్ కార్డు ఎలా వెరిఫై చేసుకోవాలో తెలుసుకుందాం.

ఆధార్ కార్డు పనిచేయకపోతే ప్రభుత్వ, ప్రైవేట్ పనులు చేయించుకోలేరు. ముఖ్యంగా ఐడెంటిటీ వెరిఫై విషయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే అసలు ఆధార్ కార్డు పనిచేస్తుందో లేదో అనేది ఆన్‌లైన్ విధానంలో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించింది యూనిక్ ఐడెంటిటీ అధారిటీ ఆఫ్ ఇండియా. దీనికోసం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని క్షణాల్లో చేయవచ్చు. ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. మొబైల్ నెంబర్ మారినా లేదా చిరునామా మారినప్పుడు కచ్చితంగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలి.

ఆధార్ కార్డు వ్యాలిడిటీ ఎలా చెక్ చేసుకోవాలి

ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ స్క్రీన్‌పై కన్పించే వెరిఫై ఆధార్ నెంబర్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత చెక్ ఆధార్ వ్యాలిడిటీ ఎంచుకోవాలి. మీ ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. అంతే మీ ఆధార్ వివరాలు అక్కడ స్క్రీన్‌పై కన్పిస్తాయి. ఆధార్ వ్యాలిడిటీ ఉందో లేదో ఆ వివరాల్లో ఉంటుంది. 

Also read: NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News