Alla Nani: ఏపీ రాజకీయాల్లో రోజూ ఏదో చర్చ జరుగుతూనే ఉంటుంది. రోజుకో మలుపు తిరుగుతుంటుంది. ఏదో ఒక అంశం హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇటీవల వైసీపీకు దూరమైన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశం గూటిన చేరారు.
రాజకీయాల్లో నమ్మకస్థులు అనే పదానికి అర్ధం ఉండకపోవచ్చు. ఎక్కడో కాగడా పెట్టి వెతికితే గానీ కనబడదు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో జంపింగ్ జపాంగ్ అంటారో అర్ధం కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా..లేకపోతే మరోలా వ్యవహరిస్తుంటారు. 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోగానే ఆ మాజీ మంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పార్టీకు రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నానంటూ వ్యాఖ్యలు చేశారు. అయినా అప్పట్నించి టీడీపీ గూటిన చేరుతారనే వార్త గుప్పుమంటూనే ఉంది. చివరికి అదే జరిగింది.
ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఉండవల్లిలో టీడీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరిపోయారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంతవరకూ వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, వీర విధేయుడిగా ఉన్నారు. అధికారం కోల్పోగానే ఆ సాన్నిహిత్యం పక్కనబెట్టేశారు. పార్టీకు రాజీనామా చేసి కొద్దికాలం మౌనంగా ఉన్నారో..ప్రయత్నాలు చేసుకున్నారో గానీ ఇవాళ హఠాత్తుగా టీడీపీ కండువాతో ప్రత్యక్షమయ్యారు.
Also read: Public Holidays 2025: విద్యాలయాలు, ఆఫీసులకు సెలవులు, ఎప్పుడు, ఏ రాష్ట్రాల్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి