Undavilli in Ysrcp: వైసీపీలో చేరనున్న ఉండవిల్లి అరుణ్ కుమార్, ముహూర్తం ఫిక్స్ అయినట్టేనా

Undavilli in Ysrcp: ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా కీలక పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. జగన్ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు రచిస్తుంటే జగన్ 2.0 చూస్తారంటూ సంకేతాలు పంపిస్తున్నారు. త్వరలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుందని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 9, 2025, 02:24 PM IST
Undavilli in Ysrcp: వైసీపీలో చేరనున్న ఉండవిల్లి అరుణ్ కుమార్, ముహూర్తం ఫిక్స్ అయినట్టేనా

Undavilli in Ysrcp: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలో జగన్ 2.0 చూస్తారంటూ సంకేతాలు పంపించిన వైసీపీ అధినేత ఆ దిశగా పావులు కదుపుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్‌ను పార్టీలో చేరగా మరో సీనియర్ నేతతో చర్చలు పూర్తయ్యాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇప్పటికే కార్యకర్తలు, నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. జగన్ కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు వైఎస్‌కు ఆప్తుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈయనతో పాటు మరి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 

2024 ఎన్నికల్లో ఓటమి తరువాత వైఎస్ జగన్ వైఖరి పూర్తిగా మారిపోయింది. కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని గమనించిన ఆయన అందుకు తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈసారి పూర్తిగా కార్యకర్తల కోసమే పనిచేస్తానని స్పష్టం చేసిన జగన్ త్వరలో జగన్ 2.0 చూస్తారని చెప్పారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ హయాంలో తండ్రి వైఎస్ఆర్‌తో సన్నిహితంగా ఉన్న నేతల్ని పార్టీలో ఆహ్వానిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. 

తాజాగా మాజీ మంత్రి శైలజానాథ్‌ను చేర్చుకున్న వైఎస్ జగన్ ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయనతో ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపారని సమాచారం.   రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చాలా అంశాల్లో మద్దతుగా నిలిచారు. అప్పుడప్పుడు మీడియా సమావేశాలతో ఉనికి చాటుకుంటున్నఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరితే పార్టీకు కచ్చితంగా మంచి వాయిస్ లభిస్తుందనే వాదన విన్పిస్తోంది. మొదటి నుంచి బీజేపీకు వ్యతిరేకిగా ముద్రపడిన ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చే నెలలో వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వైపు నుంచి ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే ఆయనను పార్టీలో ఆహ్వానించినట్టు సమాచారం. 

Also read: 7th Pay Commission DA Arrears: 18 నెలల డీఏ ఎరియర్లు, డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News