Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు..మరో మూడు రోజులపాటు వర్ష సూచన..!

Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు తన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : Jun 19, 2022, 03:30 PM IST
  • విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
  • చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా వానలు
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు..మరో మూడు రోజులపాటు వర్ష సూచన..!

Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు తన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండురోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రుతు పవనాలతోపాటు ఉపరిత ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. మరో మూడురోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి అంతర్గత తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైంది. ఉపరితల ద్రోణి ఇవాళ విదర్బ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలరు కురుస్తాయని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మూడురోజులపాటు తెలంగాణవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఉదయం నుంచి మబ్బులు కమ్ముకున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.

Also read:Chandra Babu on CM Jagan: రాజకీయ కక్షతోనే చీకటి దాడులు..సీఎం జగన్‌పై చంద్రబాబు ధ్వజం..!

Also read:YS Sharmila: పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీ.. అక్కడినుంచే ఎందుకో తెలుసా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News