Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో వందే భారత్ ట్రైన్ పరుగులు

Vande Bharat New Routes: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మార్గాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ మధ్య వందే భారత్ రైలు విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 12:07 AM IST
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో వందే భారత్ ట్రైన్ పరుగులు

Vande Bharat New Routes: దేశంలోని ప్రతి ప్రధాన రైల్వే మార్గాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రణాళికలు రూపొందిచి అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కొత్త రూట్లలో ప్రకటిస్తోంది. ప్రస్తుతం వందే భారత్ రైలు దేశంలో 8 రైల్వే రూట్లలో నడుస్తోంది. ఈ రైలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది. తక్కువ సమయంలోనే తమ గమ్యస్థానాలకు చేరుకుండడంతో బాగా ఆదరిస్తున్నారు. దీంతో ఈ రైలును మరిన్ని మార్గాల్లో నడిపేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి పండుగ కానుకగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య చివరి వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది దక్షిణ భారతదేశంలో రెండవ రైలుగా నిలిచింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ రైలు చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో ఆరంభించారు. తాజాగా మరో రెండు కొత్త రూట్లలో నడిపేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో నడపాలని ఆలోచిస్తున్నారు. కాచిగూడ నుంచి బెంగళూరు వరకు, సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, మహారాష్ట్రలోని పూణే వరకు నడిపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. 2023 చివరి నాటికి 75 వందే భారత్ రైళ్లను నడపాలనేది లక్ష్యం. అందుకు అనుగుణంగా కొత్త మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. 

ప్రస్తుతం వందేభారత్ రైళ్లు 8 మార్గాల్లో ఇవే..

రూట్ 1: న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 2: న్యూఢిల్లీ -శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 3: గాంధీనగర్ మరియు ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 4: న్యూ ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని అంబ్ అందౌరా

రూట్ 5: చెన్నై-మైసూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 6: నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 7: హౌరా-న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 8: సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Also Read: David Warner: పఠాన్ లుక్‌లో అదగొట్టిన డేవిడ్ వార్నర్.. ఆస్కార్ గ్యారంటీ  

Also Read: Ind Vs NZ: కివీస్‌తో రెండో టీ20.. ఎవరూ ఊహించని రెండు మార్పులు.. పృథ్వీ షా ఎంట్రీ కన్ఫార్మ్..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News