TTD Room Rent: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్. వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెరిగింది. ఇటీవల ఆధునికీకరణ పనులు చేపట్టిన టీటీడీ.. కొన్ని వసతి గృహాల్లో గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పనుల కోసం రూ.110 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. ఈ రూముల్లో ఏసీ, గీజర్ వంటి సదుపాయాలతో పాటు మరిన్ని వసతులు కల్పించారు. ఈ నేపథ్యంలోనే గదుల అద్దె భారీగా పెంచేసింది. 500, 600 రూపాయలు ఉన్న గదుల అద్దెను ఏకంగా రూ.వెయ్యికి పెంచడం సామాన్య భక్తులకు షాకిచ్చినట్లయింది.
తిరుమలలో మొత్తం దాదాపు 6 వేల గదులు ఉండగా.. నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలను ఒక్కసారిగా పెంచింది టీటీడీ. రూ.500, రూ.600 నుంచి రూ.1000కు పెంచేసింది. అదేవిధంగా ఈ నెల 1వ తేదీ నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3లో గదులను 150 రూపాయల నుంచి జీఎస్టీతో కలిపి 1700 రూపాయలకు పెంచింది. నారాయణగిరి రెస్ట్‌హౌస్ 4లో ఒక్కో గది అద్దె కూడా 750 రూపాయల నుంచి 1700 రూపాయలకు పెంచింది టీడీడీ. ఇక కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి ఏకంగా 2200 రూపాయల చేశారు. అదేవిధంగా స్పెషల్‌టైప్ కాటేజెస్‌లో గది అద్దె రూ.750 ఉండగా.. ప్రస్తుతం జీఎస్టీతో కలిపి రూ.2800 చేసింది.
గదులు అద్దెకు తీసుకునే భక్తులు డిపాజిట్ నగదు కూడా అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. గది అద్దె రూ.1700 అయితే డిపాజిట్‌తో కలిపి రూ.3400 చెల్లించాలి. దీంతో తిరుమల శ్రీవారి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గదుల అద్దె పెంపుపై టీటీడీ ఆలోచించాలని.. ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కోణంలో చూడొద్దంటూ కోరుతున్నారు.
ఈ నెల 9న రూ.300 దర్శనం కోటా టికెట్లు..
ఈ నెల 9న ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి రూ.300 కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెల కోటాకు సంబంధించి టికెట్లు ఆన్‌లైన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లను ఈ నెల 7వ తేదీన ఉదయం 9 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ గదులు ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు తిరుమలలో బాలాలయం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజులలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఉండవని అధికారులు తెలిపారు.
Also Read: Prabhas Broke into Tears: షోలో కన్నీటి పర్యంతం అయిన ప్రభాస్, బాలకృష్ణ.. హగ్ చేసుకుని మరీ!
Also Read: Tunisha Sharma Death: తునీషా శవమై ఉంటే సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో షీజాన్ ఛాటింగ్.. గంట పాటు అలాగే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook