Revanth Vs Babu: చంద్రబాబుతో రేవంత్ తొలి యుద్ధం..

Revanth Reddy Vs Chandrababu Naidu: తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగానే ఉంటుంది రాజకీయాల్లో. ఇక్కడ అన్నాదమ్ములు, గురు శిష్యులు, తల్లి కూతుళ్లు, తండ్రీ కొడుకులు అనే బంధాలేవి ఉండవు. అంతా పదవి చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అనుంగు శిష్యుడుగా పేరు పడ్డ తెలంగాణ సీఎం తాజాగా.. తన గురువుపైనే యుద్ధం  ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 16, 2025, 08:52 AM IST
Revanth Vs Babu: చంద్రబాబుతో రేవంత్ తొలి యుద్ధం..

Revanth Reddy Vs Chandrababu Naidu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుంగు శిష్యుడని అందరికీ తెలిసిందే కదా.తెలుగు దేశంలో ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఆయన సీఎం కావడంలో చంద్రబాబు పాత్ర ఉందని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అంతేకాదు అప్పట్లో ఓటు నోటుకు కేసులో చంద్రబాబు సూచన మేరకే రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేను కొనుగులు చేయబోయి అడ్డంగా బుక్ అయ్యారు. అంతేకాదు జైలుకు వెళ్లొచ్చారు. ఆ తర్వాత ఎన్నో గ్రూపులుండే కాంగ్రెస్ పార్టీలో కొత్త వచ్చి సీఎం పదవి దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు. ఓ రకంగా రేవంత్ రెడ్డి మంచి చాణక్యం ఉన్న రాజకీయ నేత అని చెప్పాలి.

ఇక తనకు రాజకీయ గురువుగా అందరు చెప్పే చంద్రబాబు పైనే రేవంత్ రెడ్డి తాజాగా వారుణాస్త్రం (నదీ జలాల విషయంలో) ఎక్కుపెట్టారు రేవంత్ రెడ్డి.  అవును తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. తెలంగాణలో సాగు విస్తీరం ఎక్కువ ఉంది కాబట్టి మరిన్ని నీళ్లు కావాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తోంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డు ఇప్పటికే చర్చించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపించడంతో ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది.

కృష్ణా జలాల వివాదంపై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణానది జలవివాదంపై ఉన్నతాధికారులు, న్యాయవాదులతో చర్చించారు. కృష్ణానది జలవివాదంపై దిశ నిర్దేశం చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకున్న ప్రతిపాదననను తాము అంగీకరించడంలేదని తెలిపారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా తీవ్రంగా ప్రయత్నం చేయాలన్నారు. నీళ్లలో మెజార్టీ వాటా దక్కాలని ఉన్నతాధికారులు, న్యాయవాదులకు ఉత్తమ్ సూచించారు.

రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్‌ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. అంతరాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్  నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జల్‌శక్తిశాఖ, GRMB, KRMB, ఏపీ సీఎంకు లేఖ రాయాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దీంతో గురువైన చంద్రబాబుపై నీటి అంశాలపై వార్ డిక్లేర్ చేసినట్టైయింది.

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News