Who is AP BJP President: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ చీఫ్ ఎంపికపై కొత్త ట్విస్ట్ నెలకొంది. రాష్ట్ర చీఫ్ పోస్టు ఎంపిక మరిన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ ఎంపిక ఢిల్లీ ఎన్నికల ఫలితాలే తర్వాతే ఉంటుందని పార్టీ హైకమాండ్ నేతలకు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం చీఫ్‌గా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరిని తప్పించి కొత్త నేతకు అవకాశం ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. పురంధేశ్వరి మార్పు ఖాయమని తేలడంతో పార్టీ సీనియర్లు తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం. అయితే రాష్ట్ర చీఫ్ పోస్టును వదిలేసుకున్న దగ్గుబాటి పురంధేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరి పదవి బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయ్యింది. ఆమె పదవీకాలం ముగిసి రెండు నెలలు గడిచింది. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ కొలిక్కివచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియమాకమే తారువాయి అనుకుంటున్న సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో కేంద్ర బీజేపీ నేతలు బిజిబిజీ అయిపోయారు. దాంతో ఎన్నికల ప్రక్రియ మరోసారి వాయిదా పడిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలే తర్వాతే కొత్త ప్రెసిడెంట్ ఎవరనే ప్రకటన రావొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రెసిడెంట్ రేసులో చాలా మంది లీడర్లు పోటీ పడుతుండటంతో ఎవరికి పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం బీజేపీ చీఫ్ రేసులో నలుగురు నేతలు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సుజనా చౌదరి.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కమలం పార్టీలో చేరిపోయారు. కొన్నేళ్లుగా కమలం పార్టీకి కీలకంగా మారిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. ఆయన కూడా విజయవాడ వెస్ట్ నుంచి భారీ విజయం సాధించారు. దాంతో సుజనా చౌదరికి పార్టీ చీఫ్ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పార్టీ హైకమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే సుజానా చౌదరితో పాటు ఎమ్మెల్సీ మాధవ్ కూడా పార్టీ చీఫ్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ప్రెసిడెంట్ పోస్టు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డికి ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వని పక్షంలో ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారని టాక్. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవిని కూడా కమలం పార్టీలో చేర్చకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి కమలం పార్టీలో చేరితే.. ఆయన్ను రాజ్యసభకు పంపించి కేంద్రమంత్రిని చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పి.వీ పార్థసారథి కూడా పార్టీ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన పార్థసారధికి కమలం పార్టీ పెద్దల ఆశీర్వాదం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా పార్టీ చీఫ్ పదవి విషయంపై ఈనెల 8వ తేదీ తర్వాతే ఓ క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి..
Also Read: AP Ministers Ranks: మంత్రుల పనితీరు ర్యాంకులు, పదో స్థానంలో పవన్ కళ్యాణ్
Also read: School Girl Gang Rape: టీచర్లు కాదు..కీచకులు, విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి