Srisailam Brahmothsavalu 2025: శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, వసతి, వైద్యం, దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రసాదం తదితర ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు ఐదు రోజుల ముందు నుంచే పాదయాత్రతో శ్రీశైలం తరలి వస్తారు. వారికోసం శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరంలోని కైలాస ద్వారం, భీముని కొలను, హటకేశ్వరం మెట్ల మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు నిర్మించారు.
తాగేందుకు మంచినీటి ట్యాంకర్లు వాటర్ ట్యాంక్‌లను సిద్ధం చేశారు. పాదయాత్రతో వచ్చే భక్తుల కోసం మట్టి రోడ్లను మరమ్మతులు చేసి రోడ్డు పొడువునా గ్రావెల్ పోసి ట్రాక్టర్లతో చదును చేయించారు. అధికారులు స్వయంగా పనులు పర్యవేక్షించారు. శ్రీశైలం వచ్చిన భక్తులకు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, అదనపు క్యూ లైన్లు, చంటి బిడ్డ తల్లులకు, వయో వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్‌లో దర్శనానికి వెళ్లే భక్తులకు దేవస్థానం ఈ యేడాది 300 మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్‌ని కూడా అందజేయనుంది. వాటితో పాటు అల్పాహారం, పాలు, బిస్కెట్లు అందించే ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సంవత్సరం భక్తులకు 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉచితంగా లడ్డూను ఇవ్వనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఈ సంవత్సరం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 8 లక్షల పైన 11 రోజులపాటు భక్తులు వస్తారని ఈవో శ్రీనివాసరావు అంచనా వేశారు. అందులో భాగంగా నేటి నుండి మార్చి 1 వరకు ఆర్జిత సేవలు నిలుపుదల చేసి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో తెలిపారు. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే రేపటి నుంచి మార్చి 23 వరకు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నామని, అలానే మాల ధారణ కలిగిన శివ స్వాములకు చంద్రావతీ కల్యాణ మండపం ద్వారా ప్రత్యేక దర్శన క్యూలైన్ ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షేత్ర పరిధిలో పలు చోట్ల 39 ఎకరాలలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి ఆలయానికి వసతి గృహాలకు భక్తులు వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా 10 ఉచిత బస్సుల సౌకర్యం చేస్తున్నామని తెలిపారు. మహా శివరాత్రికి విచ్చేసే భక్తులకు 35 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచి క్షేత్రంలో పలుచోట్ల లడ్డు కౌంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వికలాంగులకు, వృద్ధులకు, చంటి బిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతి కల్పిస్తామని భక్తులకు పాతాళ గంగలో గంగ మెట్ల వద్ద అలానే రాజుల సత్రం వద్ద భక్తుల స్నానానికి షవర్లను ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.