Modi AP Tour: 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. వరాల వర్షం కురిపించేనా..?

PM Narendra Modi Second Visit To AP On Jan 8th: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాతి ప్రధాని మోదీ రెండో సారి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈనెల 8వ తేదీన ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు ఎంపీ రమేశ్‌ ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 4, 2025, 12:40 AM IST
Modi AP Tour: 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. వరాల వర్షం కురిపించేనా..?

Narendra Modi AP Tour: ఎన్డీయే కూటమిలో కీలక భూమిక పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో.. కేంద్ర బడ్జెట్‌లు, నిధుల్లో ఏపీకి అగ్ర తాంబూలం వేస్తున్న ఎన్డీయే కూటమి మరోసారి ఏపీకి భారీగా వరాలు కురిపించే అవకాశం ఉంది. ఈనెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. అనకాపల్లి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రధాన పర్యటన విషయాలను ఎంపీ సీఎం రమేశ్‌ ప్రకటించారు. ఎప్పుడు, ఎందుకు పర్యటిస్తున్నారో సమగ్ర వివరాలను ఎంపీ వెల్లడించారు.

Also Read: Game Changer: మరో సంధ్య థియేటర్ కావొద్దు.. గేమ్ ఛేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సూచనలు ఇవే!

అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ సీఎం రమేశ్‌ ప్రధాని పర్యటన వివరాలు తెలిపారు. జనవరి 8 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనకాపల్లి జిల్లా వస్తున్నారని చెప్పారు. జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం, పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిలో పలు కంపెనీలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని వివరించారు.

Also Read: Dokka Seethamma Mid Day Meal: ఏపీ విద్యార్థులకు జాక్‌ పాట్‌.. రేపటి నుంచి మధ్యాహ్న భోజనం

ఇక అనకాపల్లి జిల్లా అభివృద్ధిపై ఎంపీ రమేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే నా ధ్యేయం. తుని-నర్సీపట్నం-మాడుగుల మీదుగా కొత్తగా ప్రధాన రహదారి ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. ఈ హైవేతో ఈ ప్రాంతం పారిశ్రామికoగా అభివృద్ధి చెందుతుంది' అని ఎంపీ రమేశ్‌ తెలిపారు. దేశమంతా అనకాపల్లి పార్లమెంటు వైపు చూసేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మంచి వాతావరణం నెలకొంది. అనకాపల్లి, మాడుగుల, ఎలమంచిలి నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తాం' అని ఎంపీ రమేశ్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా ఉన్నారు.

కాగా ప్రధాని మోదీ పర్యటన అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వస్తే ప్రధాని మోదీ పర్యటన ఖాయమవుతుంది. అయితే మోదీ వచ్చేది రానిది ఇంకా అధికారికంగా తెలియదు. ఎంపీ రమేశ్‌కు ఉన్న సమాచారం మేరకు ఈ విషయాన్ని ప్రకటించినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News