GBS Disease Updates in Telugu: ఏపీలో ఇప్పుడు అందరికీ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి భయం పట్టుకుంది. గుంటూరులో ఓ మహిళ మరణించడం, కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి పట్ల భయం అవసరం లేదని వైద్యులు చెబుతున్నా ప్రజల్లో మాత్రం భయం పోవడం లేదు.
ఏపీ ప్రజల్ని ఇప్పుడు జీబీఎస్ వ్యాధి వెంటాడుతోంది. ఇటీవల గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో ఓ మహిళ మృతి చెందడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. మహారాష్ట్ర నుంచి వ్యాపించిన ఈ వ్యాధి పట్ల మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ తెలంగాణ, ఏపీలో ఇద్దరు మహిళలు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీబీఎస్ వ్యాధి తీవ్రత, మందులు, వైద్యంపై సమీక్ష నిర్వహించారు. కేసుల తీవ్రత ఎలా ఉంది, చికిత్స అందుబాటులో ఉందా లేదా అనే విషయం ఆరా తీశారు. ఏపీ ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 5 కేసులు, కాకినాడలో 4 కేసులు, విజయనగరం, అనంతపురం, విజయవాడలో ఒక్కొక్క కేసు నమోదైంది. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
జీబీఎస్ వ్యాధి అనేది మనిషి వ్యాధి నిరోధక శక్తిపై దాడి చేస్తుంది. అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకవచ్చు. ఈ వ్యాధి సోకితే కాళ్లు చేతులు బలహీనపడి, తిమ్మిరి, పక్షవాతం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ తరహా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
ఖరీదైన చికిత్స
జీబీఎస్ వ్యాధి అంటువ్యాధి కాకపోయినా చికిత్స చాలా ఖరీదైంది. అందుకే ప్రజలు చాలా భయపడుతున్నారు. ఈ వ్యాధి సోకితే ఇమ్యునోగ్లోబిన్ ఇంజక్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు 20 వేలు కాగా రోజుకు 5 ఇంజక్షన్ల చెప్పు ఐదు రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రోజుకు 1 లక్ష రూపాయల చొప్పున 5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయితే ఈ వ్యాధిని ఎన్టీఆర్ వైద్య సేవలో చేర్చామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7 వందల ఇంజక్షన్లు ఉండగా, గోడౌన్లలో 429 ఉన్నాయన్నారు.
Also read: Rythu Bharosa: రైతన్నలకు శుభవార్త, ఎక్కౌంట్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి