Gold Coins: పైపులైన్‌ కోసం తవ్వుతుండగా.. బయటపడ్డ బంగారు నాణేలు! షాక్‌లో యజమానులు

Gold Coins found in oil palm farm in AP. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామ పరిధిలో బంగారు నాణేలు బయటపడ్డాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 3, 2022, 08:29 AM IST
  • పైపులైన్‌ కోసం తవ్వుతుండగా
  • బయటపడ్డ బంగారు నాణేలు
  • షాక్‌లో యజమానులు
Gold Coins: పైపులైన్‌ కోసం తవ్వుతుండగా.. బయటపడ్డ బంగారు నాణేలు! షాక్‌లో యజమానులు

Gold Coins found in oil palm farm at Koyyalagudem village in Eluru: తాజాగా ఓ రైతు పొలంలో బంగారం పండింది. మీరు చూస్తుంది నిజమే. తోటలో పైప్ లైన్ కోసం తవ్వుంటే.. బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామ పరిధిలో బంగారు నాణేల మట్టి పిడత దొరికింది. ఇది పురాతన కాలానికి చెందినవి అధికారులు తెలిపారు. బంగారు నాణేలను చూడగానే యజమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారట. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఏడువాడలపాలెం గ్రామంలో మానుకొండ తేజస్వికి ఆయిల్‌పాం తోట ఉంది. ఆ తోటలో పైపులైన్‌ కోసం నవంబర్ 29న కాలువ తవ్వారు. కాలువ తవ్వుతుండగా బంగారు నాణేలున్న మట్టి పిడత బయటపడింది. అది చూడటానికి చాలా పురాతనమైనదిగా కనిపించింది. పిడతను చూడగానే  తేజస్వి, ఆమె భర్త సత్యనారాయణకు అనుమానం వచ్చింది. మట్టి పిడతను పగులగొట్టి చూడగా అందులో పురాతన కాలానికి చెందిన బంగారు నాణేలు ఉన్నాయి. దాంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

మానుకొండ తేజస్వి, సత్యనారాయణ ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దారు పి నాగమణి ఆయిల్‌పాం తోటకు వచ్చి నాణేలతో పాటు వాటిని ఉంచిన మట్టి పిడతను పరిశీలించారు. ఒక్కో నాణెం సుమారు 8 గ్రాములకు పైగా బరువు ఉంటుందని ఆమె నిర్ధారించారు. ఇవి రెండు శతాబ్దాల క్రితం నాటివి అని చెప్పారు. గత నెల 29న ఈ బంగారు నాణేలు దొరకగా.. విషయం ఆలస్యంగా బయటపడింది. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: Gold Price Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర! వరుసగా నాలుగో రోజు

Also Read: Sapthami Gowda Pics: బ్లాక్ మినీ స్కర్ట్స్‌లో సప్తమి గౌడ.. కేక‌పెట్టిస్తున్న కాంతార బ్యూటీ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News