YSRCP MLAs Suspended: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు.. ఆ ఇద్దరు వీళ్లే..!

Four MLAs Suspended from YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయింది. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు పేర్లు ముందే తెలిసిపోగా.. తాజాగా మరో ఇద్దరు పేర్లను ప్రకటించారు సజ్జల రామకృష్టారెడ్డి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 05:33 PM IST
YSRCP MLAs Suspended: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు.. ఆ ఇద్దరు వీళ్లే..!

Four MLAs Suspended from YSRCP: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ.. వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంది. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే క్రాస్‌ ఓటింగ్ పాల్పడగా.. అందరూ అంచనా వేసినట్లే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్లు కూడా కన్ఫార్మ్ అయ్యాయి. ఈ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో వీరు క్రాసింగ్ ఓటింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. 

క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ నిర్వహించామని సజ్జల తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొన్నారని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇచ్చారని చెప్పారు. క్రాస్ ఓటింగ్‌కు చేసినవాళ్లకు టికెట్ ఇస్తామని కూడా టీడీపీ చెప్పి ఉండవచ్చన్నారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. దర్యాప్తు తర్వాతే వేటు వేశామన్నారు. 

'ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లోబడి క్రాస్ ఓటింగ్ చేశారు. అంతర్గతంగా దర్యాప్తు చేసి.. ఆధారాలతో సహా గుర్తించాం. నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశాం. గడప గడప రిపోర్టుతో పాటు గెలవని ఎమ్మెల్యేలను గుర్తించి జగన్ ముందే హెచ్చరించారు. గెలవని వారికి చివరి నిమిషంలో చెప్పకుండా ముందే టిక్కెట్లు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ఈ నలుగురు పార్టీ లైన్ దాటారు. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వారెవరూ పార్టీ లైన్ దాటలేదు. సీటు లేకపోతే రాజకీయం లేదని కొద్ది మంది భావిస్తున్నారు. అలాంటి వారే ఇలా చేస్తారు. 

10 నుంచి 20 కోట్ల వరకూ ప్రలోభాలకు గురుచేసి చంద్రబాబు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మా పార్టీ అంతర్గతంగా చేసిన విచారణలో అన్ని ఆధారాలు గుర్తించినందు వల్లే నిర్ణయం తీసుకున్నాం. పార్టీ నుంచి ప్రకటన కూడా విడుదల చేస్తాం. డబ్బుకు అమ్ముడుపోయారనేదే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. చంద్రబాబు దగ్గర డబ్బులెక్కువ ఉన్నాయి కాబట్టి.. ఎన్నికల్లో ఇలాంటివి చేస్తుంటాడు. సంతలో సరుకులను కొన్నట్లు కొనడానికి సిద్ధంగా ఉంటాడు. గతంలో ఓటుకునోటు కేసులో బ్రీఫ్డ్ మీ అనే దొరికిపోయాడు. ఆయన వ్యవహారశైలికి తగ్గట్లే చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు..' అని సజ్జల అన్నారు.

Also Read: Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు  

Also Read: AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News