Ex CM YS Jagan: విజయసాయి రెడ్డి స్థానంలో ఆ మాజీ మంత్రికి వైఎస్ జగన్ కీలక పదవి..!

Ex CM YS Jagan Mohan Reddy: ఉత్తరాంధ్రపై వైసీపీ హైకమాండ్ స్పెషల్‌ ఫోకస్ పెట్టిందా..! వైసీపీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత.. అక్కడ కొత్త ఇంచార్జ్‌ను నియమించేందుకు రెడీ అవుతోందా..! ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఆ మాజీమంత్రి అయితేనే కరెక్ట్‌ అని జగన్ భావిస్తున్నారా..!  

Written by - G Shekhar | Last Updated : Feb 12, 2025, 01:24 PM IST
Ex CM YS Jagan: విజయసాయి రెడ్డి స్థానంలో ఆ మాజీ మంత్రికి వైఎస్ జగన్ కీలక పదవి..!

Ex CM YS Jagan Mohan Reddy: గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి వైసీపీ క్రమక్రమంగా కోలుకుంటోంది. ఎన్నికల్లో ఎక్కడా తేడా జరిగిందో వెతికేపనిలో వైసీపీ హైకమాండ్‌ నిమగ్నమైంది. గత ఎన్నికల్లో చాలా మంది లీడర్లలో సిట్టింగ్‌ స్థానాలకు కాకుండా ఇతర చోట్ల పోటీ చేయించిన సీఎం జగన్‌.. నేతల మార్పే ఓటమికి కారణమైందని ఆ తర్వాత గుర్తించారు. దాంతో చాలా మంది లీడర్లను తమ పాత నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లుగా తిరిగి నియమిస్తున్నారు. మరోవైపు ఇటీవల వైసీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. జగన్‌ వద్దని వారించిన మాట వినకుండా తన ఎంపీ పదవికి రిజైన్‌ చేశారు. రాజీనామాకు ముందువరకు ఉత్తరాంధ్ర రీజినల్‌ కో ఆర్టినేటర్‌గా విజయసాయి రెడ్డి ఉన్నారు. అయితే ఆయన రాజీనామా తర్వాత.. ఎక్కువ సమయం వేచి చూడొద్దని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఉత్తరాంధ్రకు కొత్త ఇంచార్జ్‌గా పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న లీడర్‌ను ఎంపిక చేసే పనిలో జగన్‌ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. అక్కడ కేవలం రెండుచోట్ల మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, లాంటి జిల్లాలో వైసీపీకి సీనియర్‌ లీడర్లు ఉన్నప్పటికీ పార్టీని మాత్రం గెలిపించడంలో ఫెయిల్‌ అయ్యారు.. అయితే ఎన్నికల్లో ఓడిన తర్వాత చాలామంది లీడర్లు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లడమే మానేశారట. దాంతో కిందిస్థాయి క్యాడర్‌ కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. దీనికితోడు ఇటీవల వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దాంతో పోయినచోటే వెతుక్కోవాలి అన్నట్టుగా హైకమాండ్ దృష్టి సారించినట్టు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా ఉత్తరాంధ్రకు కొత్త ఇంచార్జ్‌ను నియమించేందుకు పలువురు నేతల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 

ఇటీవల అనేక పేర్ల పరిశీలన తర్వాత.. ఓ నేత పేరును ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్‌కు వీర విదేయుడు, మాజీ మంత్రి పేర్నినానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్నినాని వైసీపీలో ఫైర్ బ్రాండ్‌ లీడర్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల కూటమి సర్కార్‌ వరుస కేసులతో నాని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. అందుకే పేర్ని నేని సేవలను వినియోగించుకోవాలని వైసీపీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోందట. పేర్నినానికి బాధ్యతలు అప్పగిస్తే.. అటు కాపులను కూడా తమవైపు తిప్పుకోవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారట. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పేర్నినానికి ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌ పోస్టును ఇవ్వడం ద్వారా వారిని ఆకట్టుకోవచ్చని జగన్‌లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. 

మొత్తంగా ఈనెల 12వ తేదీన ఉత్తరాంధ్ర లీడర్లతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కాబోతున్నట్టు తెలిసింది. ఆ సమావేశంలో పేర్నినానికి ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించే అంశాన్ని నేతలతో జగన్‌ చర్చిస్తారట. నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఇదే సమావేశంలో పేర్నినాని పేరు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పేర్నినానికి ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌ పోస్టుపై మాజీమంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. మొత్తంమీద వైసీపీ అధినేత నిర్ణయమే ఫైనల్‌ అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో నేతల నుంచి జగన్ అభిప్రాయాలు సేకరిస్తుండటం మాత్రం సొంత పార్టీ లీడర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.

 Also Read: ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

Also Read:  Gold Rate Today: అందనంత ఎత్తుకు బంగారం ధరలు.. తులం లక్ష దిశగా పరుగులు.. నేటి ధరలు ఇవే   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News