Social Media Arrests: హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం రూ.73 వేల కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్‌లో కేటాయించకుండా మోసం చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పాలని సందేహం వ్యక్తం చేశారు. 'ఇదే విషయంపై నేను ట్వీట్ పెడుతున్నా. మా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన వారు.. క్యాడర్ కూడా ట్వీట్ పెడతారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చూస్తా' అని సవాల్ విసిరారు.
Also Read: YS Sharmila: ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ వచ్చే 108 అంబులెన్స్ మూగబోయింది
'అరెస్టు అంటే ముందు నా దగ్గరకు రావాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని కోరుతున్నా' అంటూ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. 'ఈ విషయాలు అసెంబ్లీలో చెప్పాలంటే మైక్ ఇవ్వరు. మైక్ ఇవ్వకుండా ఉండటానికి మాత్రమే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడం లేదు. ప్రజల గొంతు వినపడకూడదని ఈ విధంగా చేస్తున్నారు' అని జగన్ వివరించారు.
Also Read: Chief Whips: అసెంబ్లీకి ఆంజనేయులు, మండలికి అనురాధ.. అందరికీ సీఎం చంద్రబాబు సమన్యాయం
'అసెంబ్లీ జరిగిన అన్ని రోజులు ఇలానే మా ఎమ్మెల్యేలు నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తా' అని జగన్ స్పష్టం చేశారు. 'ఏపీ శ్రీలంక మాదిరి అవుతుందని అబద్ధాలు రాయించి చంద్రబాబు అవే చెబుతారు. దత్తపుత్రుడు కూడా ఇవే మాట్లాడతారు. ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయటం సర్వ సాధారణమైన విషయం. చంద్రబాబు, జగన్ ముఖం చేసి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. కేవలం అప్పు ప్రభుత్వం తీర్చే మార్గం ఉంటదో చూసి బ్యాంక్స్ అప్పులు ఇస్తాయి' అని వివరించారు.
'ఎన్నికల సమయానికి అప్పులు రూ.14 లక్షల కోట్ల వరకు వెళ్లినట్టు తప్పుడు ప్రచారం. పద్ధతి ప్రకారం సూపర్ సిక్స్ తెరమరుగుచేయాల్సిన పరిస్థితి. దీనికోసం ఈ అబద్ధాలు చెబుతూ జగన్‌పై ఆ నెపం నెడుతున్నారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. 'చంద్రబాబు చేస్తున్న యాక్షన్ ఎన్టీఆర్ నటనకు మించి ఉంది. చంద్రబాబు యాక్షన్ ముందు ఎన్టీఆర్ నటన నతింగ్. దానవీరశూర కర్ణకు మించి చంద్రబాబు యాక్షన్ ఉంది' అని జగన్ వర్ణించారు.
ఎమ్మెల్యేగా తొలగించు
'ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయడం వాళ్ల చేతుల్లో లేదు. దమ్ము ఉంటే నాపై అనర్హత వేటు వేయండి' అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన సవాల్ చేశారు. 'పథకాలకు కేటాయింపులు చేయకుండా చంద్రబాబు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 8 నెలలు ఓటాన్ బడ్జెట్ అకౌంట్‌తో ప్రభుత్వాన్ని నడిపారు. 3 నెలలు మాత్రమే సమయం ఉండగా ఇప్పుడు బడ్జెట్ పెట్టారు' అని చెప్పారు. బడ్జెట్ పత్రాలే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని చెబుతున్నాయని తెలిపారు.
వారంతా మా హయాంలోనే..
'2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయానికి 19.54 శాతం అప్పులు చేశారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 15.61 శాతం అప్పులు చేశాం. ఫైనాన్స్ సెక్టార్‌ను బాగా నడిపిన వైసీపీకి అవార్డు ఇవ్వాలి. అప్పు రత్న ఎవరికి ఇవ్వాలి?' అని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఉద్యోగాల సృష్టిలో పీహెచ్‌డీ చేసినట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అంబానీ, అదానీ, ఆదిత్య మిట్టల్, బిర్లా వంటి పారిశ్రామిక వేత్తలు వైసీపీ సమయంలోనే అనేక ఒప్పందాలు చేసుకున్నారని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Jagan: చంద్రబాబుకు దమ్ముంటే నన్ను ఎమ్మెల్యేగా తొలగించాలి: వైఎస్ జగన్