YSR Family Dispute: వ్యక్తిగతంగా.. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైఎస్ షర్మిలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. షర్మిలకు తాను రక్షణగా ఉంటానని డిప్యూటీ సీఎం పవన్ సంచలన ప్రకటన చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయినా మదం తగ్గలేదని.. చింత చచ్చినా పులుపు చావలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జగన్ అదనపు రక్షణ కావాలని కోరిందని.. అది తాము కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
Also Read: Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు చెక్కు అందజేత
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. దీపం పథకంలో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించిన అనంతరం పవన్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ విభేదాలపై స్పందించారు. 'చింత సచ్చినా పులుపు చావలేదు అనే రీతిన వైఎస్సార్‌సీపీ పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో మాపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోంది. స్వామి మీద ఆన మీ సంగతి తేలుస్తా' అని హెచ్చరించారు.
Also Read: YSR Family Dispute: వైఎస్ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!
'పదకొండు సీట్లు వచ్చినా పులుపు చావలేదు మీ తాట తీస్తా. ఆడబిడ్డల మాన ప్రాణాలకు ఏ మాత్రం తేడా వస్తే చూస్తూ ఊరుకోము' అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎవరూ తప్పులు చేసినా సమయంతో సహా డిజిటల్‌గా రికార్డ్ చేయాలి. జగన్ సొంత సోదరి అదనంగా సెక్యూరీటీ అడిగింది. మీకు ప్రభుత్వం అండగా ఉండి రక్షణ కల్పిస్తాం' అని పవన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కుల, మత ఘర్షణలు తీసుకువస్తే మీ సంగతి తేలుస్తామని హెచ్చరిక జారీ చేశారు. వైసీపీ నాయకులు ఏమీ మాట్లాతున్నారో అన్ని తమ దగ్గర ఉన్నాయని.. త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
'గత జగన్ ప్రభుత్వం కంటే పరిపాలన బాగా చేసి చూపిస్తున్నాం. గత ప్రభుత్వం దోచుకొని దాచుకుంది. ఐదేళ్ల నుంచి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లలో ప్రయాణం చేయాలంటే వెన్నుపూస కదులుతోంది' అని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరుపై పవన్ తప్పుబట్టారు. 'అధికారులు మెతగ్గా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. మీపై చర్యలు ఉంటాయి' అని హెచ్చరించారు.
తాను అన్ని మతాలను గౌరవిస్తానని.. తన మతాన్ని ఆరాధిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 'నేను ఏమైనా మాట్లాడితే హిందూ వాది అని ముద్ర వేస్తున్నారు. హైందవ ధర్మం.. సనాతన ధర్మంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం జనసేన నారసింహ వారాహి గళం విభాగాన్ని ప్రారంభిస్తాం' అని ప్రకటించారు. 'నేను ఆరాధించే సనాతన ధర్మం కోసం నేను చనిపోయే వరకు పోరాడుతా' అని సంచలన ప్రకటన చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook