Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం 10వేలకు పైగా కరోనా కేసులు, వందకు చేరువలో మరణాల సంఖ్య నమోదవుతోంది. గత 24గంటల్లో ( శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు ) 10,603 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,767కి చేరుకోగా.. ఇప్పటివరకు 3,884 మంది ఈ మహమ్మారితో మరణించారు. Also read: Delhi Metro: 7నుంచి మెట్రో సేవలు.. స్మార్ట్‌కార్డ్‌తోనే అనుమతి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 99,129 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 3,21,754 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. గత 24గంటల్లో 63,077 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36,66,422 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24గంటల్లో 9,067మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..
Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు
AP: కొత్తగా 10,603 కరోనా కేసులు.. 88 మంది మృతి