Early detection of cancer: భారతదేశంలో బాల్య దశ క్యాన్సర్‌లు అరుదుగా కనిపించినప్పటికీ, ప్రస్తుతం మన దేశంలో నమోదైన మొత్తం క్యాన్సర్లలో దాదాపు 4% వాటా ఈ వ్యాధికి ఉంది. కాబట్టి ముందంచుగానే దీని గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ICMR-NCDIR నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలో క్యాన్సర్ చికిత్స రేట్లు తక్కువగా ఉన్నాయి. అందుకే.. వీటిని ముందుగా గుర్తించి సమర్థవంతమైన చికిత్స అందిస్తే, దీని బారిన పడే అవకాశం ముందే పిల్లలు పూర్తిగా కోలుకోవచ్చు. ఇక ఇదే విషయంపై డాక్టర్ స్నేహ సాగర్ సిరిపురపు, ఎండి , DrNB మెడికల్ ఆంకాలజీ, కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, జివికె హెల్త్ హబ్.. కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. మరి ఆమె చెప్పిన వివరాలను ఈ ఆర్టికల్లో చదువుదాం..
హెచ్చరిక సంకేతాలు
చిన్నారుల్లో క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించడం కష్టతరమైన ప్రక్రియ. సాధారణంగా, దీని లక్షణాలు ఇతర సాధారణ..అనారోగ్యాలతో సమానంగా ఉంటాయి. అందుకే వీటిని గమనించడం కొంచెం కష్టమైనప్పటికీ.. కింద చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి మీ పిల్లల్లో కనిపించిన డాక్టర్ని వీలైనంత త్వరగా సంప్రదించడం ఉత్తమం. ఈ ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు విషయానికి వస్తే:
- తరచుగా జ్వరం రావడం, అలసట, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం.
- శరీరంలో నొప్పిలేని గడ్డలు, ఉదరం లేదా మెడలో వాపులు.
- ఎముక నొప్పి, కళ్ళలో తెల్లటి మచ్చలు, ఆకస్మికంగా దృష్టి మార్పులు.
- వివరించలేని బరువు తగ్గడం, తలనొప్పి, ఉదయాన్నే వాంతులు.
ఈ లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే.. ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా..తక్షణమే వైద్యులను సంప్రదించడం అవసరం.
ఇక భారత దేశంలో పిల్లల్లో క్యాన్సర్ సంఖ్య పెరుగుదల ఉండే అవకాశం ఎందుకు ఉంది అనే విషయానికి వస్తే..
1. ఆరోగ్య అవగాహన లోపం – క్యాన్సర్ లక్షణాలను సమయానికి గుర్తించలేకపోవడం.
2. ఆర్థిక పరిమితులు – చిన్నారుల క్యాన్సర్ చికిత్స ఖరీదైనదై, తగిన సహాయం అందకపోవడం.
3. ఆధునిక చికిత్స కొరత – అత్యాధునిక పరీక్షలు, పీడియాట్రిక్ ఆంకాలజీ సేవలు అందుబాటులో లేకపోవడం.
4. రోగ నిర్ధారణ ఆలస్యం – సరైన వైద్య మార్గదర్శకాల లేమి వల్ల రోగ నిర్ధారణ ఆలస్యం అవడం.
5. మౌలిక సదుపాయాల లోపం – బ్రాకీథెరపీ, ఇన్ఫెక్షన్ నియంత్రణ గదులు లాంటి సదుపాయాలు తక్కువగా ఉండడం.
అంతేకాకుండా ఈ క్యాన్సర్ లో వివిధ రకాలు ఉన్నాయి. మరి ఆ వివిధ క్యాన్సర్లు ఏవి వాటి లక్షణాలు ఏమిటంటే:
1. లుకేమియా – రక్త క్యాన్సర్, దీని లక్షణాలు అలసట, తరచుగా ఇన్ఫెక్షన్లు.
2. మెదడు కణితులు – తలనొప్పి, వికారం, మతిమరుపు.
3. లింఫోమా – శరీరంలో నొప్పిలేని గడ్డలు, బరువు తగ్గడం.
4. రెటినోబ్లాస్టోమా – కంటి క్యాన్సర్, తెల్లటి ప్రతిబింబం కనిపించడం.
5. విల్మ్స్ ట్యూమర్ – మూత్రపిండ క్యాన్సర్, పిల్లలలో పెరుగుదల సమస్యలు.
వీటి పరిష్కార మార్గాల విషయానికి వస్తే:
1.అవగాహన పెంపుదల – చిన్నారుల ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య శిబిరాల ద్వారా క్యాన్సర్ గుర్తింపు.
2.సక్రమ వైద్య సేవలు – బాల్య క్యాన్సర్‌కు ప్రత్యేకంగా వైద్య సేవలను అభివృద్ధి చేయాలి.
3.ఆర్థిక సాయం – ప్రభుత్వ పథకాలు మరింత విస్తరించాలి.
4.మౌలిక సదుపాయాల మెరుగుదల – అధునాతన చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
భారతదేశంలో బాల్య దశ క్యాన్సర్ చికిత్సలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, సమర్థవంతమైన వైద్య సేవలు, ముందస్తు నిర్ధారణ, ప్రభుత్వ మద్దతు ఉంటే ఈ వ్యాధిని ఎదుర్కోవడం సులభం. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి. కాబట్టి పైన చెప్పిన లక్షణాల్లో పిల్లల్లో ఏవి కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. డాక్టర్లను సంప్రదించి..సరైన వైద్య సేవలను గుర్తించి వారికి అందించండి.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.