Amaravati Outer Ring Road: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఇప్పటికే నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భారీగా నిధులు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో శుభవార్త తెలిపింది. అమరావతికి బాహ్య వలయ రహదారి (ఔటర్ రింగ్ రోడ్డు) నిర్మిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా దానికయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని చెప్పడం విశేషం. కేంద్ర ప్రకటనతో అమరావతికి మహర్దశ రానుంది. ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం.
ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరుసగా వరుసగా వరాలు ప్రకటిస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వాటికయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని కేంద్రం ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో భాగంగా ఎన్‌హెచ్‌ఏఐ నుంచి అమరావతికి శుభవార్త అందింది. ఓఆర్‌ఆర్ రాకతో విజయవాడ, అమరావతి, గుంటూరు మధ్య అభివృద్ధి జోరుగా సాగుతుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు సాగించేందుకు ఓఆర్‌ఆర్ భారీ ప్రయోజనం లభించనుంది. భారీ వాహనాలు విజయవాడ, గుంటూరు, అమరావతి మార్గంలో కాకుండా ఓఆర్‌ఆర్ మీదుగా రాకపోకలు సాగిస్తే ట్రాఫిక్ సమస్యకు కొంత పరిష్కారం లభించినట్టు అవుతుంది.
Also Read: Honey Trap: వైజాగ్‌లో కిలేడీ హల్‌చల్.. అబ్బాయిలకు మత్తుమందు ఇచ్చి నగ్న ఫొటోలతో
ఫలిస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు
అధికారంలోకి ఊహించని రీతిలో సంచలన విజయం సాధించిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా ప్రాధాన్యం ఇస్తోంది. నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీకి విశేష ప్రాధాన్యం ఇస్తూ భారీ కేటాయింపులు లభిస్తున్నాయి.
కేంద్రంలో చంద్రబాబుకు ప్రాధాన్యం
అంతేకాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు వంటి వాటిపై విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తూ ఏపీకి కావాల్సిన వాటిని పొందుతున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆయన కృషికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి పాతిక వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం ఇప్పుడు అమరావతికి ఓఆర్‌ఆర్ ప్రకటించడమే కాకుండా తామే నిర్మిస్తామని ప్రకటించడం చూస్తుంటే కేంద్రం సీఎం చంద్రబాబుకు లభిస్తున్న ప్రాధాన్యం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి