Big Breaking: వైయస్ కుటుంబంలో ముదిరిన ముసలం.. తల్లి, చెల్లిపై కోర్టు కెక్కిన ఎక్కిన వైయస్ జగన్..

Big Breaking: రాజకీయాల్లో తమ, పర భేదాలుండవని చెబుతుంటారు. కొన్ని సార్లు అవి నిజమే కాబోలు అనిపిస్తోంది. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైయస్ఆర్సీ అధినేత జగన్.. తన తల్లి , చెల్లిపై వ్యతిరేకంగా కోర్టు కెక్కడం సంచలనంగా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 23, 2024, 10:20 AM IST
Big Breaking: వైయస్ కుటుంబంలో ముదిరిన ముసలం.. తల్లి, చెల్లిపై కోర్టు కెక్కిన ఎక్కిన వైయస్ జగన్..

Big Breaking: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లోకెక్కింది. అంతేకాదు ఇంటి గుట్టు మరోసారి రచ్చ కెక్కింది. తాజాగా అన్నా చెల్లెల్ల మధ్య ఆస్తుల వివాదం ముదిరింది. తాజాగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో .. తన చెల్లి, తల్లి తనకు తెలియకుండా కుట్ర పన్ని షేర్లు ట్రాన్స్ ఫర్ చేసారు. అంతేకాదు అందులో తనకు, తన భార్య వైయస్ భారతికి కంపెనీలో ఆజామాయిషీ లేకుండా చేశారని వైయస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం (NCLT)లో వాళ్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

వైఎస్ షర్మిల అన్న అనే గౌరవ భావం లేకుండా.. నా పరువు ప్రతిష్ఠలను పట్టించుకోకుకండా.. నాకు వ్యతిరేకంగా వ్యవహరించడం తనను కలిచివేసిందన్నారు.  అంతేకాకుండా  రాజకీయంగా నేను కుటుంబ సభ్యులైన తల్లి, చెల్లి, భార్యను పదవులకు దూరంగా పెట్టాను. ఈ నేపథ్యంలో తన చెల్లికి రాజకీయంగా  ఎలాంటి పదవి దక్కకపోవడంతో తనపై ఓపెన్ గా అసత్య ఆరోపణలు చేయడం మొదలు పెట్టిందన్నారు. తనపై తప్పుడు ప్రకటనలతో తన రాజకీయ ప్రత్యర్ధులో కలిసి పొలిటికల్ గా  తనను మానసికంగా వేధింపులకు గురి చేసిందన్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఒక అన్నగా తన చెల్లిపై తనకు ప్రేమ, ఆప్యాయతలున్నాయని.. కానీ షర్మిలకు  మాత్రం అన్నగా తనపై ఎలాంటి గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ వస్తోంది.  ఈ నేపథ్యంలో మా మధ్య ఉన్న అన్నా, చెల్లి అనే బంధానికి బీటలు వారిందన్నారు. రాజకీయంగా ఎవరో ఉసి గొల్పితే.. తనపై పొలిటికల్ గా తీవ్ర ఆరోపణలు చేయడాన్ని తనను ఎంతగానో కలిచివేసిందన్నారు.

వరుస సంఘటనల నేపథ్యంలో మా మధ్య ప్రేమానురాగాలకు తావు లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో తన చెల్లితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు ఉండకూడదనే నిర్ణయానికి వచ్చాము. అందుకే ఆస్తుల బదిలీతో పాటు కంపెనీలో వాటాలు ఇకపై కొనసాగించకూడదనే నిర్ణయానికి వచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన పిటిషనల్ పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి  నుంచి విజయమ్మకు 74 లక్షల 26 వేల 294 ఈక్విటీ షేర్లు.. భారతి నుంచి వైయస్ విజయమ్మకు 40 లక్షల 50 వేల షేర్లు.. వేర పిటిషనర్ నుండి 12 లక్షలకు షేర్లను ప్రతివాదులు 3,4కి బదిలీని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించినట్టు జగన్ పేర్కొన్నారు.

 

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News