న్యూఢిల్లీ: త్వరలో గడువు ముగియనున్న రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ షెడ్యూల్ జారీచేసింది. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది సభ్యుల రాజ్యసభ పదవీకాలం వచ్చే ఏప్రిల్ నెలలో ముగియనుంది. ఈ క్రమంలో ఈసీ రాజ్యసభ స్థానాల భర్తీ కోసం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీ నుంచి మహ్మద్ అలీ ఖాన్, టి. సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి.. తెలంగాణ నుంచి కేవీపీ రామచందర్ రావు, గరికపాటి మోహన్ రావుల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 9న ముగియనుంది.
Also Read: ‘నమస్తే ట్రంప్’ నుంచి బై బై ట్రంప్ వరకు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
నోటిఫికేషన్ జారీ: మార్చి 6న
నామినేషన్ చివరి తేదీ: మార్చి 13
నామినేషన్ చివరి తేదీ: మార్చి 16
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 18
పోలింగ నిర్వహించే తేదీ: మార్చి 26న
పోలింగ్ సమయం: ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటలవరకు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ: మార్చి 26న సాయంత్రం 5 గంటలకు
మార్చి 30లోగా పోలింగ్ కచ్చితంగా పూర్తి కావాల్సి ఉంది..