Chandrababu vs Pawan: ఏపీలో కూటమి ప్రభుత్వానికి 8 నెలలు పూర్తయ్యాయి. అప్పుడే కూటమి పార్టీ నేతల మద్య క్షేత్రస్థాయిలో వార్ మొదలైంది. ఇప్పుడు కొత్తగా సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం పంచాయితీ ప్రారంభమైందని తెలుస్తోంది. చంద్రబాబు ఫోన్‌కు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడమే ఇందుకు కారణం.
కూటమి ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. కూటమిలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయితీ నడుస్తోంది. నిన్నటి వరకూ అనారోగ్యంతో కేబినెట్ సహా ముఖ్యమైన సమావేశాలకు హాజరుకాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీర్ధయాత్రలకు సనాతన అవతారంతో బయలుదేరారు. ప్రభుత్వ పెద్దలకు, సంబంధిత అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లడం సందేహలకు తావిస్తోంది. ఫిబ్రవరి 6న జరిగిన కేబినెట్ భేటీకు హాజరుకాలేదు. అంతకు ముందే డిప్యూటీ సీఎంగా లోకేశ్ చర్చ మొదలవడంతో తెలుగుదేశం వర్సెస్ జనసేన మద్య అంతర్గతంగా దూరం పెరుగుతోంది. తెలుగుదేశం ఉద్దేశ్యపూర్వకంగా డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్ పేరు తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం మొదలైంది.
చంద్రబాబు వపన్ కళ్యాణ్ మద్య దూరానికి కారణాలు
వాస్తవానికి తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అంతా తానై వ్యవహరించడం తెలుగుదగేశం నేతలు నచ్చలేదు. సనాతన అవతారం ఎత్తడంలో కూడా ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించలేదు. అంతకుముందు హోం మంత్రిత్వ శాఖ విషయంలో చేసిన వ్యాఖ్యలు టీడీపీలో ఆగ్రహం కల్గించాయి. ఇక తిరుపతిలో తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలనడంతో పవన్ కళ్యాణ్‌తో దూరం పెరుగుతూ వచ్చింది.
ఇప్పుడు తాజాగా అనారోగ్య కారణాలతో కేబినెట్ భేటీ సమావేశాలకు హాజరు కాకుండా ఒకేసారి దక్షిణాదిలోని ఆలయాల సందర్శన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కేబినెట్ మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన భేటీకు కూడా హాజరు కాలేదు. ఎందుకనే ప్రశ్న వచ్చినప్పుడు వెన్ను నొప్పి కారణంగా రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తాను కూడా పవన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానని అందుబాటులో రాలేదని చంద్రబాబు చెప్పారు. తాను ఫోన్ చేసినా స్పందించలేదని స్వయంగా చంద్రబాబు అందరి ముందు చెప్పడం చర్చకు దారితీస్తోంది. సాక్షాత్తూ చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఇప్పుడు రాజకీయంగా సందేహాలకు తావిస్తోంది.
వెన్ను నొప్పితో బాధపడుతూ సమావేశానికి హాజురు కాలేదని నాదెండ్ మనోహర్ చెప్పిన మాటల్లో నిజం లేకపోవచ్చని ఇవాళ పవన్ సనాతన అవతారంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం చూస్తే అర్ధమౌతుంది. తాను స్వయంగా ప్రయత్నించినా అందుబాటులో రాలేదని చంద్రబాబు బహిరంగంగా చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Also read: AP Mega Dsc: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి