AP: సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని భారీవర్షాలు ( Heavy rains ), వరద ( Floods ) పరిస్థితులపై ప్రతిపక్షనేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తక్షణం సహాయక చర్యలు తీసుకోవల్సిందిగా సీఎం జగన్ ను కోరారు.

Last Updated : Aug 17, 2020, 11:08 PM IST
AP: సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని భారీవర్షాలు ( Heavy rains ), వరద ( Floods ) పరిస్థితులపై ప్రతిపక్షనేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గోదావరి వరద ( Godavari flood ) పోటెత్తడంతో గోదావరి జిల్లాల్లో పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని...తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ను చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు.  భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి ఓ వైపు పెరుగుతోందని..మరోవైపు కరోనా మహమ్మారి ముప్పు ఉండటంతో ప్రజలకు ఊహించని కష్టాలొచ్చిపడ్డాయన్నారు చంద్రబాబు ( Chandra babu naidu ). గోదావరి వరద కారణంగా వందలాది గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారని చంద్రబాబు తెలిపారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయి..అన్నదాత తీవ్రంగా నష్టపోయాడన్నారు. తక్షణం ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి..అన్ని వసతుల కల్పించాలని కోరారు. మరోవైపు వరదలు, వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని...పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. Also read: Vijayawada: ముగ్గుర్ని కారులో ఉంచి..సజీవ దహనం చేసేందుకు ప్రయత్నం

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x