AP Mega Dsc 2025 Update: నిరుద్యోగులకు శుభవార్త. మెగా డీఎస్సీపై అప్‌డేట్ వచ్చింది. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. మార్చ్‌లో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై క్లారిటీ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే భారీగా ఉపాధ్యాయల నియామకాలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు. అయితే ఆ తరువాత వాయిదా పడుతూ వస్తోంది. నవంబర్ 6న వెలువడనుందని ప్రకటించి ఆ తరువాత మళ్లీ వాయిదా వేసింది ప్రభుత్వం. దాంతో డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.
ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువర్తిస్తామన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియను మార్చ్ నెలలో ప్రారంభించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామన్నారు. ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. డ్రాప్ అవుట్స్ నివారించేందుకు, విద్యార్ధుల సంఖ్యను కచ్చితంగా తెలుసుకునే అపార్ కార్డు విధానం గురించి వెల్లడించారు.
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో 16,317 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఇందులో ఎస్జీటీ పోస్టులు 6371 ఉంటే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7725 ఉన్నాయి. టీజీటీ పోస్టులు 1781 ఉన్నాయి. పీజీటీ పోస్టులు 286 ఉంటే, ప్రిన్సిపాల్ పోస్టులు 52, పీఈటీ పోస్టులు 132 ఉన్నాయి.
Also read: Income Tax vs Salary Hike: కొత్త ఇన్‌కంటాక్స్ ప్రభావం, పెరగనున్న ఉద్యోగుల జీతాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి