మరోమారు కెబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఉండవల్లి ప్రజా వేదికలో 11న ఈ విస్తరణ కార్యక్రమానికి ముహుర్తం ఖారారు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో కేబినెట్ విస్తరణపై కొందరు సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. ఈ సారైనా తమకు ప్రాధాన్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సారి కేబినెట్ లో ఇప్పటి వరకు ప్రాధాన్యం దక్కని వర్గాలకు చోటు కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కొన్ని వర్గాల మెప్పు పొందాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలకు చెందిన వారిని కేబినెట్ లో స్థానం కల్పించి ఆ వర్గాల మెప్పుపొందాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలో మైనార్టీ వర్గాలను ఆకట్టుకునేందుకు ఆ వర్గానికి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ ఫరూక్ ను కేబినెట్ లో తీసుకోనున్నట్లు టాక్. అలాగే ఇటీవలె మవోయిస్టుల చేతిలో గిరిజన ఎమ్మెల్యే కిడారి హతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గిరిజన ప్రజల సానుభూతి పొందేందుకు కిడారి తనయుడికి కేబినెట్ లో తీసుకొవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి..