Hanuman Birth Place: ఆంజనేయుని జన్మస్థలం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి స్పష్టమైన వాదన విన్పిస్తోంది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని తేల్చిచెబుతున్నారు పరిశోధకులు.
హనుమంతుడి జన్మస్థలం విషయంలో గత కొద్దిరోజులుగా వాదన నెలకొంది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ(TTD)వాదిస్తోంది. ఇందుకు తగ్గ ఆధారాలున్నాయంటోంది. దీనికి సంబంధించి పురాణాలు, శాసనాలు, భౌగోళిక ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయంటోంది. ఇటు పీఠాధిపతులు, పండితులు, చారిత్రక పరిశోధకులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. టీటీడీ వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుని జన్మస్థలం(Hanuman birth place) అంజనాద్రి అంశంపై నిర్వహించిన రెండ్రోజుల అంతర్జాతీయ వెబినార్‌లో కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తిరుమల(Tirumala)క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయస్వామి జన్మస్థలమని, ఆళ్వారుల పాశురాల్లోని వైష్ణవ సాహిత్యం ఇదే చెబుతోందని సెమినార్లో పాల్గొన్న ఆచార్యులు చెబుతున్నారు. రుగ్వేదం నుంచి వర్తమాన సాహిత్యం వరకూ అన్ని పదాల్లో అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిరూపితమైందని..సాహిత్య ఆధారాలున్నాయని వివరించారు. తిరుమల(Tirumala) అంజనాద్రిలోని ఆంజనేయుడు జన్మించిన స్థలంలో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. త్వరలో ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రి అంటూ ఆధారాలతో గ్రంధం ముద్రించనున్నామన్నారు.
Also read: మాస్క్ లేకుండా అనుమతిస్తే 25 వేల వరకూ భారీ జరిమానా, ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook