AP Minister Satya kumar:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన అల్లు అర్జున్ పుష్ప సినిమా టార్గెట్ చేశారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలన్నారు. బందిపోట్లు, స్మగ్లర్ల సినిమాలు తీయడమేంటన్నారు. గతంలో హీరోలు ఇలాంటి సినిమాలు చేసినా.. ఆయా సినిమాల్లో చివర్లో హీరోలు పశ్చాతాపం కారణంగా మారిపోయినట్టు చూపించేవారు. కానీ ఇప్పటి సినిమాల్లో డాన్లు హీరోలవుతున్నారు. స్మగ్లర్లు ఆరాధ్య కథానాయకులవుతున్నారు. సినిమాల్లో దొంగతనం చేసేవాడిని హీరోగా ఆరాధించే వారు.. నిజ జీవితంలో అలా ఓ దొంగను చూస్తారా అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో తగ్గేదేలే అన్నట్టుగా చెత్తో చూపిస్తూ సమాజంలో ఇలాంటి సినిమాలు మంచివి కాదన్నారు AP మంత్రి భారతీయ జనతా పార్టీ ఏపీ అగ్ర నేత సత్యకుమార్. కాగా మంత్రి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమాను సినిమాలానే చూడాలి కానీ కామెంట్స్ ఏంటంటున్నారు. అంతేకాదు పుష్ప సినిమాలోని నటనకు కేంద్రం ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సినిమాల్లో చూపించేదంత నిజం కాదు. అది కేవలం నటన మాత్రమే. దాన్ని అలాగే చూడాలి. అంతేకాదు పద్మభూషణ్, పద్మవిభూషణ్ సహా వివిధ అవార్డులు అందుకున్న హీరోలు ఇలాంటి కథలతో సినిమాలు చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
పుష్ప 2 సినిమా విషయానికొస్తే.. గతేడాది చివర్లో విడుదలై సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో సోదిలో లేకుండా పోయిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ ఒక్క హిందీ వెర్షన్ నుంచి రావడం గమనార్హం. అంతేకాదు మన దేశంలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటి సినిమా వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1850 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మన దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన బాహుబలి 2 రికార్డును దాటి సరికొత్త సంచలనం రేపింది.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.