AP Government Big Update: 2024ఎన్నికల్లో తెలుగుదేశం నేతృత్వంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. త్వరలో అత్యంత కీలకమైన మరో పధకం అమలు చేయనుందని తెలుస్తోంది. ఏపీ వార్షిక బడ్జెట్‌లో మూడు కీలకమైన హామీలకు కేటాయింపు ఉంటుందని సమాచారం.
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైనవి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి. ప్రభుత్వం ఏర్పాటు చేసి 8 నెలలు అయినా ఈ మూడు పథకాలపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత వస్తోంది. దాంతో ఈ మూడు పధకాలను త్వరగా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికి 15 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అన్నదాత సుఖీభవలో భాగంగా ఏడాదికి 20 వేల రూపాయలు ఇవ్వాలి. ఇందులో 6 వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తాయి. ఈ మూడు పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ వార్షిక బడ్జెట్ ఈ నెల 28 లేదా మార్చ్ 1న ఉండవచ్చు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సూపర్ సిక్స్‌లో భాగంగా రెండు హామీలు అమల్లో ఉన్నాయి. అందులో ఒకటి పెన్షన్ల పెంపు కాగా రెండవది ఉచిత గ్యాస్ సిలెండర్ పధకం. మిగిలిన పధకాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఇప్పుడు త్వరలో అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకాలు ప్రారంభించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఒకవేళ మూడు పధకాలకు నిధుల సమస్య ఉంటే కనీసం తల్లికి వందనం అమలు చేయవచ్చని సమాచారం.
Also read: Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్, మే నెల టికెట్లు విడుదల, ఏ టికెట్లు ఎప్పుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి