AP Government: కొద్ది రోజుల్లో ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభం కానుంది. రంజాన్ ఉపవాసాలు పురస్కరించుకుని కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ నెలంతా గంట ముందే ఆఫీసు నుంచి ఇంటికెళ్లే అవకాశం కల్పిస్తోంది.
రంజాన్ నెల వచ్చిందంటే చాలు ముస్లింలు అందరూ కఠినమైన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. మార్చ్ 2 నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. రోజూ తెల్లవారుజామున 5 గంటల కంటే ముందే సహరి ఆచరిస్తారు. తిరిగి సాయంత్రం 6.30 గంటల వరకూ పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టరు. సాయంత్రం ఇఫ్తార్‌తో ఉపవాసం విడుస్తారు. ఇలా 30 రోజులు నిరవధికంగా చేస్తారు. రంజాన్ నెలలో 5 పూట్ల తప్పకుండా నమాజు ఆచరించడమే కాకుండా రాత్రి వేళ ప్రత్యేకంగా తరావీ నమాజులు చదువుతారు. మొత్తానికి రంజాన్ నెలలో ముస్లింలు ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్ధనలతో బిజీగా ఉంటారు.
అందుకే ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం కల్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ నెలంతా ఉద్యోగులు తమ తమ ఆఫీసుల నుంచి సాయంత్రం ఓ గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. అంటే సాయంత్రం 5 గంటలకు ఆఫీసు పనివేళలు ముగిస్తే ముస్లిం ఉద్యోగులు 4 గంటలకే ఇంటికి వెళ్లవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మసీదుల్లో ఉండే మౌజన్, ఇమామ్‌లకు అందించే గౌరవ వేతనాన్ని కొసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసినట్టే ఇమామ్‌లకు 10 వేలు, మౌజన్‌లకు 5 వేల గౌరవ వేతనం కొనసాగనుంది.
Also read: AP Mega Dsc: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి