Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్టు డిప్యూటీ సీఎం టీమ్ వెల్లడించిది. ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో ఉన్నారు.
ఏపీ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీనికి తోడు గత కొద్దికాలంగా వెంటాడుతున్న స్పాండిలైటిస్ సమస్య ఎక్కువైందని వైద్యులు తెలిపారు. దాంతో వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకొంటున్నారని జనసేన టీమ్ ట్వీట్ చేసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నందున కొద్దిరోజులు బయటకు రారని , కేబినెట్ సమావేశానికి కూడా హాజరుకారని జనసేన వర్గాలు తెలిపాయి.
వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర…— JanaSena Party (@JanaSenaParty) February 5, 2025
వైరల్ జ్వరం పెద్ద సమస్య కాకపోయినా స్పాండిలైటిస్‌కు మాత్రం విశ్రాంతి తప్పనిసరి అని వైద్యులు సూచించారు. లేకపోతే సమస్య మరింత జటిలం కావచ్చు. అందుకే ఇటీవల ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి సైతం వెళ్లలేదని తెలుస్తోంది.
Also read: 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి