Hero Vishal: దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. అసెంబ్లీ, లోక్‌సభకు ఏకకాలంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? అనేది అత్యంత ఉత్కంఠ జరుగుతోంది. ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడీ ఎలా ఉందని కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. తమదైన విశ్లేషణ చేస్తూ తమ సర్వేలు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలపై ప్రముఖ హీరో జోష్యం చెప్పారు. ఏపీ ఎన్నికల్లో వచ్చేది ఎవరో స్పష్టంగా చెప్పేశారు.
Also Read: Jagan Convoy: సీఎం జగన్ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
ఏపీ ఎన్నికలపై జోష్యం చెప్పిందే ఎవరో కాదు ప్రముఖ నటుడు విశాల్. మళ్లీ వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. హరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రత్నం' సినిమాతో విశాల్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ, ఏపీలో పర్యటిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో విశాల్ రాజకీయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు. జగన్‌పై రాళ్ల దాడి ఘటన, ఏపీ ఎన్నికలు, తమిళ రాజకీయాలపై స్పందించారు. ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ వర్తమాన అంశాలపై మాట్లాడారు.
Also Read: Jagan Stone Attack: జగన్‌పై రాళ్ల దాడిలో కీలక మలుపు.. రూ.350 క్వార్టర్ మందు కోసం రాయితో దాడి?
'నేను రాజకీయాల్లో రావాలని ప్రచారం చేస్తున్నారు. నన్ను గెలుకుతున్నారు. మేం రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితిని వాళ్లే తీసుకువస్తున్నారు' అని విశాల్ తెలిపారు. వైఎస్ జగన్ వ్యవహారంపై స్పందించారు. 'వైఎస్సార్‌సీపీకి నేను మద్దతు ఇస్తున్నానేది తప్పు. నేను జగన్ అభిమానిని. ఆయన మద్దతుదారుడిని నేను. జగన్‌ను బయటి నుంచి చూస్తున్నా. మే 13వ తేదీన మళ్లీ గెలిచేది జగన్ ముఖ్యమంత్రి అవుతారు' అని ప్రకటించారు.
జగన్‌పై రాళ్లదాడిపై విశాల్ స్పందిస్తూ.. 'జగన్‌పై దాడులు కొత్త కాదు. ఎయిర్ పోర్టులో కోడి కత్తి దాడి జరిగింది. రాజకీయాల్లో ఇలాంటివి సరికాదు. జగన్ అన్నిటికి సిద్ధమైన వ్యక్తి. రాయలసీమ పౌరుషం జగన్‌లో ఉంది' అని తెలిపారు. పవన్ కల్యాణ్ విషయమై ప్రస్తావిస్తూ.. 'పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడు. పవన్ మంచి వ్యక్తి. కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా. రాజకీయాల్లోకి వచ్చి చాలా కష్టపడుతున్నాడు' అని వివరించారు.
ఇక తమిళనాడులో తాను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. 'కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తా. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా. నిజానికి కోపం, కసితో ఈ నిర్ణయం తీసుకుని రాజకీయ పార్టీ పెడుతున్నా' అని తెలిపారు. తాను కుప్పం నుంచి పోటీ చేస్తున్నాననే వార్తలను మరోసారి కొట్టిపారేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter