Israel- Hamas: 15 నెలల యుద్ధానికి ముగింపు.. గాజాలో అంబరాన్నంటిన సంబరాలు, 46,000 మంది మృతి..

Israel- Hamas Ceasefire ends: 15 నెలల యుద్ధానికి తెరపడింది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. ఈ యుద్ధంలో 46వేల మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు. దాదాపు లక్ష మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 2023 అక్టోబర్ 3వ తేదీ నుంచి ఇజ్రాయిల్ అనూహ్య దాడితో హమాస్ యుద్ధానికి తెరలేపింది. ఇక నిన్నటితో ఆ యుద్ధానికి దద్దరిల్లింది.

Written by - Renuka Godugu | Last Updated : Jan 16, 2025, 07:54 AM IST
Israel- Hamas: 15 నెలల యుద్ధానికి ముగింపు.. గాజాలో అంబరాన్నంటిన సంబరాలు, 46,000 మంది మృతి..

Israel- Hamas Ceasefire: ఇజ్రాయిల్‌పై 2023 అక్టోబర్ నుంచి అనూహ్యంగా హమాస్ యుద్ధానికి తెరలేపింది. ఈ దాడిలో 1200 మంది గా పైగా ఇజ్రాయిల్ పౌరులను కోల్పోయింది. ఆగ్రహించిన ఇజ్రాయిల్ తమ సైన్యాన్ని గాజాలోకి పంపి ప్రతీకార దాడులకు చేసింది. ఇలా దాదాపు 15 నెలలపాటు గాజా దద్దరిల్లింది. ఇక ఇజ్రాయిల్‌ హమాస్ మధ్య కాల్పుల విరమణ తో గాజాలో సంబరాలు అంబరాన్నంటాయి . కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడంతో యుద్ధానికి బ్రేక్ పడింది. దీంతో గాజా ప్రాంతంలోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

ఇజ్రాయిల్ హమాస్‌ మధ్య కాల్పుల విరమణతో గాజాలో సంబరాలు చేసుకున్నారు. బాంబుల మోతతో దద్దరిల్లిన గాజాకు కాల్పుల వీరమణ ఒప్పందం ఓ పెద్ద ఉపశమనం ఇచ్చింది. దీంతో గాజాలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సంబరాలలో మునిగి తేలారు. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో అమాయకపు పౌరులు 46 వేల మంది చనిపోయారు. ఇందులో చిన్నపిల్లలు, మహిళలే అత్యధికంగా ఉన్నారు. లక్ష మందికి పైగా తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు.

ఇజ్రాయిల్ పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దాదాపు 250 మందిని కిడ్నాప్ చేయగా.. ఇప్పటిలో వీరికి 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు.  విడుదల చేసేందుకు అంగీకారం ఒప్పందం ఇరు దేశాలు చేసుకున్నా కనీసం మూడింటి ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇది నిజమైతే ఇజ్రాయిల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఇక ఇజ్రాయిల్ హమాస్ దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారిన సంగతి తెలిసిందే. 15 నెలల్లో ఇజ్రాయిల్ దాడుల ప్రధాన సూత్రధారి అబ్దుల్ హదీ సబా, కసబ్ ను చంపేసింది. సిన్వర్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. కీలక నేతలను మట్టు పెట్టింది ఇజ్రాయిల్ హమాస్‌కు సహకరించిన చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్ కీలక నేతలను చంపేసింది.

ఇక ఇజ్రాయిల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని యూఎన్‌ చీఫ్‌ ఆంటోని గుట్టెర్రాస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఈ కాన్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.. దీనికి మధ్యవర్తిత్వం వహించిన యూఎస్‌ఏ, ఖాతర్‌, ఈజిప్టు దేశాలను ఆయన అభినందించారు. అయితే బాధిత పౌరులకు అవసరమైన మానవతా సాయాన్ని కూడా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్ హమాఖ కాల్పుల విరమణ ని యూకే ప్రధాని స్టార్మర్ కూడా స్వాగతించారు.

ఇదీ చదవండి:  తిరుమలలో విషాదం.. గ్రిల్స్‌ నుంచి పడి మూడేళ్ల బాలుడు  మృతి..!    

ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని యుఎస్ కి కాబోయే డోనాల్డ్ ట్రంప్ కూడా స్వాగతించారు మిడిలిస్టులో బందిలను విడిపించేందుకు డీల్ కుదురుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 24 అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఇజ్రాయిల్ హౌ మచ్ మధ్య కాల్పుల విరమణ కేవలం ఆరు వారాల ఒప్పందం మాత్రమే అని తెలిసింది ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఆరువారాల పార్టీ అమల్లో ఉండనట్లు ఉండనున్నట్లు కొని వార్త కథనాలు తెలుపుతున్నాయి ఇజ్రాయిల్ బలగాలు గాజానా త్వరలో వీడనున్నాయి దీంతో ఇరువర్గాల బందీలను కూడా విడుదల చేసేందుకు పరస్పర అంగీకారం తెలిపారని కూడా వెల్లడించాయి..

ఇదీ చదవండి: అదేంటి శోభిత అలా చేసింది? అవిలేకుండా పండుగపూట అడ్డంగా దొరికిపోయింది..!షాక్‌లో ఫ్యాన్స్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News