Russia Military Jet: కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 65 మంది యుద్ధఖైదీల మృత్యువాత..

Ukraine:ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో వందల సంఖ్యలో యుద్ధఖైదీలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 04:18 PM IST
Russia Military Jet: కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 65 మంది యుద్ధఖైదీల మృత్యువాత..

Belgorod Jet Crashes: రష్యాలో ఘోర విమానం సంభవించింది. ఉక్రెయిన్- రష్యా సరిహద్దులోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఇల్యుషిన్-76 విమానంలో ఉక్రెయిన్ యుద్ధఖైదీలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో  ఒక్కసారిగా పేలిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం ప్రమాదం జరిగిన  తర్వాత అనేక మంది ఖైదీలు మరణించినట్లు అధికారులు గుర్తించారు. దాదాపుగా...  65 మంది మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖను ఒక ప్రకటనలో తెలిపింది. 

బెల్గోరోడ్ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దులో ఉంది.  ఇటీవలి నెలల్లో ఉక్రెయిన్ నుండి తరచుగా దాడికి గురవుతున్నట్లు సమాచారం.  డిసెంబరులో జరిగిన క్షిపణి దాడిలో 25 మంది మరణించారు. అయితే..  విమానం ప్రమాదంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రియా నోవోస్టి వార్తా సంస్థ మాట్లాడుతూ, విమానంలో ఉన్నవారిలో ఉక్రెయిన్ సాయుధ దళాలకు చెందిన బంధించిన సభ్యులు ఉన్నారని చెప్పారు.

"బోర్డులో 65 మంది స్వాధీనం చేసుకున్న ఉక్రేనియన్ ఆర్మీ సర్వీస్‌మెన్‌లను మార్పిడి కోసం బెల్గోరోడ్ ప్రాంతానికి రవాణా చేస్తున్నారు. ఆరుగురు సిబ్బంది, ముగ్గురు ఎస్కార్ట్‌లు ఉన్నారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. విమాన ప్రమాదానికి గల కారణాలను పరిశోధిస్తున్నామని విమానయాన అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

రష్యా యొక్క ఇల్యుషిన్-76 విమానం, సైనిక దళాలు,  కార్గో, సైనిక పరికరాలు, ఆయుధాలను తరలించడానికి ప్రత్యేకంగా రూపొందించబడినట్లు సమాచారం. దీనిలో దాదాపు, ఐదుగురు వ్యక్తులతో కూడిన సాధారణ సిబ్బందితోపాటు, 90 మంది ప్రయాణించవచ్చని తెలుస్తోంది. 

Read Also: Ayodhya: అయోధ్యలో అరుదైన ఘటన.. రామ్ లల్లా గర్భగుడిలోకి ప్రవేశించిన వానరం ఏంచేసిందో తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News