Hamas Terrorist Reveals Horrifying Details: ఇజ్రాయెల్‌లో దాడులకు తెగబడిన హమాస్ ఉగ్రవాదుల్లో ఒకరిని సజీవంగా పట్టుబడ్డాడు. అతడిని బంధించిన ఇజ్రాయెల్ సైన్యం.. వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. దాడికి సంబంధించిన భయానక విషయాలను ఆ ఉగ్రవాది పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాడి సమయంలో పిల్లలు, పసిపాపలు, మహిళలు, వృద్ధులతో సహా తమకు కనిపించిన వచ్చిన ప్రతి ఒక్కరినీ హతమార్చినట్లు హమాస్ ఉగ్రవాది వీడియోలో వెల్లడించాడు.
హమాస్ టెర్రరిస్టులు బాలికలపై కూడా అత్యాచారం చేశారని చెప్పాడు. పసికందుల తలలు నరికి.. వారి తలలను నేలపై ఉంచారని తెలిపాడు. కిడ్నాప్, అత్యాచారం, హత్యలు మతంలో నిషిద్ధమని కూడా బోధించారని పేర్కొన్నాడు. ఈ వీడియో ద్వారా హమాస్ ఉగ్రవాదులు సాగించిన క్రూరత్వం బట్టబయలు అయింది. 21 ఏళ్ల ఉగ్రవాది దక్షిణ గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా నగరమైన రఫాకు చెందినవాడని సైన్యం వెల్లడించింది. అతని పేరు మహమ్మద్ నహెద్ అహ్మద్ ఎల్-అర్షా అని తెలిపింది. గాజా నుంచి వచ్చిన ఉగ్రవాదులు పిల్లలతో సహా ఇజ్రాయెల్ మహిళలపై అత్యాచారం చేసి.. హింసించారని, శిరచ్ఛేదం చేశామని హమాస్ ఉగ్రవాది అంగీకరించాడు.
ఇక ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ఇజ్రాయెల్ దేశస్థులు ప్రాణాలు కోల్పోయారు. 3,200 మందికి పైగా గాయపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హమాస్ ఇప్పటివరకు ఇజ్రాయెల్‌పై 6,000 రాకెట్లను ప్రయోగించగా.. ఐడీఎఫ్ దాదాపు 2,700 హమాస్ స్థావరాలను నాశనం చేసింది. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడిలో హమాస్ మిలిటెంట్లతో సహా 1,500 మంది పాలస్తీనియన్లు మరణించారు. 6,612 మంది గాయపడ్డారు.
మరోవైపు గాజాలో భూతల దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే గాజాలోని ప్రజలను దక్షిణం వైపునకు తరలించాలని కోరింది. అయితే తమ భద్రతా సూచనలను పట్టించుకోవద్దని గాజా నివాసితులకు హమాస్ చెబుతోందని ఐడీఎఫ్ వెల్లడించింది. ఇప్పటికే గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం.. ఏరివేత మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఆరంభం మాత్రమేనని.. హమాస్ మూల్యం చెల్లించుకోవడం మొదలైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఏం జరుగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనని.. గతంలో ఎప్పుడూ లేనంత బలంగా యుద్ధాన్ని ముగిస్తామని స్పష్టం చేశారు. వారిని ఎప్పటికీ క్షమించమని.. పూర్తిగా నాశనం చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు.
Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!
Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి